modi | security | maoists

17 layer security cover for pm narendra modi on chattisgarh tour

modi, security, maoists, naxals, police

A 17-layer security will cover Prime Minister Narendra Modi when he will address a public meeting at the district headquarters town of Dantewada in Chhattisgarh’s Naxal-infested south Bastar region, scheduled on May 9, police sources said on Monday.

ప్రధాని మోదీకి ఇంత టైట్ సెక్యురిటీనా..? అయ్య బాబోయ్

Posted: 05/09/2015 11:42 AM IST
17 layer security cover for pm narendra modi on chattisgarh tour

ఆయన అసలే దేశానికి ప్రధాని, దేశ భవిష్యత్తు ఆయన చేతిలోనే ఉంది. అలాంటి కీలక వ్యక్తికి సెక్యురిటీ కాస్త టైట్ గానే ఉండాలి. భారత ప్రధాని నరేంద్ర మోదీకి గత కొంత కాలంగా సెక్యురిటి కల్పిస్తున్నారు. అయితే మావోయిస్టుల చెల్లుబడి నడిచే ప్రాంతాల్లో పర్యటించే ప్రధాని నరేంద్ర మోదీకి ఎంత టైట్ గా సెక్యురిటీ అందించాలని అనుకుంటున్నారు.. మీరు నరేంద్ర మోదీ సెక్యురిటీ గురించి తెలిస్తే షాక్ అవుతారు. మొదటిసారిగా ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న నరేంద్ర మోదీకి అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంతలా అంటే మోదీ చుట్టూ 17 వరుసల సెక్యురిటీ ఉందంటే నమ్మాలి మరి. అసలే మావోయిస్టులు ఎక్కువగా ఉండే ప్రాంతం .. అందునా ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఎలాంటి చిన్న ఘటన జరిగినా దేశ పరిస్థితిలోనే మార్పు వస్తుంది అందుకే సెక్యురిటీని బాగా పెంచేశారు. ఛత్తీస్ ఘడ్ లో పర్యటిస్తున్న మోదీ సెక్యురిటీకి సంబందించిన వివరాలు..

ప్రధాని మోదీ పర్యటించే ప్రాంతానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోని అన్ని ప్రాంతాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కనీసం పోలీసులకు తెలియకుండా ఈగ కూడా ప్రవేశించలేనంతగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 10 వేల మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది దంతెవాడ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా కూబింగ్ నిర్వహిస్తు పరిస్థితిని మార్చేశారు. మోదీ చుట్టూ దాదాపు 17 వరుసల సెక్యూరిటీని ఉంచారు. మోదీ పర్యటన కారణంగా బంద్ కు పిలుపునిచ్చిన మావోలు.. సకుమా జిల్లాకు చెందిన గిరిజనులను కిడ్నాప్ చేశారు. దాంతో సెక్యురిటీ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  security  maoists  naxals  police  

Other Articles