Ap | Special status | Narendra modi

Ap telugudesam party and bp party leader met pm narendra modi on special status

Ap, Special status, Narendra modi, Sujana chowdary, jc devakar reddy, hari babu

Ap telugudesam party and bp party leader met pm narendra modi on special status. Sujana chowdary explain the situation in the ap state.

ప్లీజ్.. ప్లీజ్.. ప్రత్యేక హోదా ఇవ్వండి

Posted: 05/09/2015 08:30 AM IST
Ap telugudesam party and bp party leader met pm narendra modi on special status

ఏపి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని చేస్తున్న డిమాండ్ పై కేంద్రం నుండి మాత్రం సానుకూల  స్పందన రావడం లేదు. అయితే టిడిపి, బిజెపి గత ఎన్నికల సమయంలో జతకట్టి ఏడాది కావస్తుండటంతో కనీసం ఇప్పటికైనా ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్లు ప్రధాని మోదీ చేత ప్రకటించాలని టిడిపి, బిజెపి నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, బిజెపి నాయకులు ప్రధాని మోదీని కలిశారు. ప్రత్యేక హోదాను ప్రకటించడంలో జరుగుతున్న జాప్యానికి కారణాలేవైనా గత ప్రభుత్వ హామీని అమలు చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదేనని కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రధానికి సమర్పించిన విజ్ఞాపన పత్రం స్పష్టం చేసింది. ప్రత్యేక కేటగిరీ హోదాతో పాటు రాష్ట్ర విభజన చట్టం హామీలన్నింటినీ అమలు చేసే విషయంలో ఒకటి, రెండు ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుకు శంకుస్థాపనలు, నామమాత్రపు నిధుల విడుదల తప్ప ఇంతవరకూ పెద్దగా ఒరిగిందేమీ లేదన్న టిడిపి పార్లమెంట్‌ సభ్యులు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడగల స్థితికి చేరుకొనేలా రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రత్యేక హోదాపై బిజెపి నేతలు వ్యక్తం చేస్తున్న భిన్న వాదనలతో రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆందోళన నెలకొంటున్నదని సుజనా చౌదరి ప్రధానికి వివరించారు.  విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలలో ఇప్పటి వరకూ అమలైన ప్రాజెక్టులు, మంజూరైన నిధుల వివరాలను  హరిబాబు వివరించారు.  ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమౌతున్న అభిప్రాయాలను తెలియజేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ఐదు కోట్ల ప్రజానీకానికి అత్యంత భావోద్వేగ అంశంగా తయారైందన్న జెసి దివాకర్ రెడ్డి.. ఈ విషయంలో ఇంకెంత మాత్రం జాప్యం జరిగినా పర్యవసానాలు దారుణంగా ఉంటాయని కూడా ఆయన ప్రధాని మోడీకి తేల్చిచెప్పినట్లు సమాచారం. మరి ప్రధానికి ఇలా తెలుగుదేశం పార్టీ, బిజెపి పార్టీల నాయకులు కలిసి చేసిన వినతిపై ప్రధాని మోదీ ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే నారా చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్కటే అయితే సరిపోదు ఎక్కువ నిధులు కూడా కావాలని ప్రధానికి గతంలో కోరారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ap  Special status  Narendra modi  Sujana chowdary  jc devakar reddy  hari babu  

Other Articles