Botsa satyanarayana makes controversial comments agrigold scam | ap cm chandrababu naidu

Botsa satyanarayana controversial comments agrigold scam chandrababu naidu

Botsa satyanarayana news, Botsa satyanarayana controversy, Botsa satyanarayana incidents, Botsa satyanarayana press meet, chandrababu naidu, chandrababu controversy, agrigold scam, agri gold controversy

Botsa satyanarayana controversial comments agrigold scam chandrababu naidu : Congress senior leader botsa satyanarayana makes controversial comments on agrigold scam. He told chandrababu and their members hands behind this big scam.

అగ్రిగోల్డ్ కుంభకోణంలో సీఎం చంద్రబాబు హస్తం!

Posted: 05/08/2015 09:00 PM IST
Botsa satyanarayana controversial comments agrigold scam chandrababu naidu

యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కుంభకోణంతో ఎంతోమంది రోడ్డునపడిన వ్యవహారం తెలిసిందే! ఇందులో ఏజెంట్లుగా పనిచేసినవాళ్లందరూ తమ ఇళ్లు వదులుకుని తలలు దాచుకుని తిరుగుతుండగా.. ఇందులో పెట్టుబడులు పెట్టుకున్నవారంతా లబోదిబోమంటూ బ్రాంచీలముందు గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమ భవిష్యత్ కోసం తమ కష్టార్జితాన్ని ఎంతో నమ్మకంగా ఈ గోల్డ్ లో డబ్బులు జమచేస్తే.. ఆ ఆశలు నీరుగారాయంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు.

ఇలా ఎంతోమందిని నిరాశ్రయుల్ని చేసిన ఈ భారీ కుంభకోణంలో సీఎం చంద్రబాబు హస్తం వుందంటూ ఓ నేత ఆరోపణలు గుప్పిస్తూ.. మరో సంచలనానికి తెరదీశారు. ఆయన మరెవ్వరో కాదు.. కాంగ్రెస్ నేత బొత్స సత్యానారాయణ! విజయనగరం జిల్లాలో మాట్లాడిన బొత్స.. అగ్రిగోల్డ్ వ్యవహారం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. వేల కుంభకోణం జరగడంతో బాధితులంతా రోడ్డెక్కి నినదీసినందుకు వారిని అరెస్ట్ చేసిన చంద్రబాబు.. మోసగాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. రాష్ట్రంలో ఇంత పెద్ద కుంభకోణం జరిగితే దానిగురంచి ముఖ్యమంత్రి ఒక్క ముక్క కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో టీడీపీ నేతలకూ భాగస్వామ్యం వుండటంతో ఆ పార్టీ నేతలు, బాబు పెదవి విప్పడం లేదని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఏపీ సర్కార్ చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు.

అటు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విషయంపైనా బొత్స తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు వేవారు. ఆర్టీసీ కార్మికులు మూడురోజులుగా సమ్మె చేస్తుంటే దానిని పరిష్కరించాల్సిన సీఎం బాబు.. తనకు ఏమీ తెలియదన్నట్టుగా జిల్లాల పర్యటనలు చేస్తూ కాలం గడుపుతున్నారని ఆయన సెటైర్లు వేశారు. ఈ విధంగా బొత్స చేసిన కామెంట్లపై టీడీపీ వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Botsa satyanarayana  chandrababu naidu  agrigold scam  

Other Articles