bridegroom alopes with his girl friend before his marriage

Bridegroom escape with his girl friend from marriage

bridegroom alopes with girl friend, bridegroom missing before his marriage, bridegroom ubsconding before his marriage, bridegroom, marriage, girl friend, escape, bridegroom his girl friend alopes before marriage

bridegroom who was not dare enough to tell his parents about his love, alopes before his marriage

వరుడిని కాదు.. ప్రేమికుడినే..అంటూ ఇలా చేశాడు..

Posted: 05/06/2015 09:14 PM IST
Bridegroom escape with his girl friend from marriage

తాను వరుడు కాదన్నాడు. ప్రేమికుడేనని తేల్చిచెప్పాడు. ఇంతవరకు బాగానే వున్నా..  అదే విషయాన్ని పెద్దలకు ఎందుకు చెప్పలేదు. ఒక అమ్మాయికి న్యాయ చేయడం కోసం మరో అమ్మాయిని తడిగుడ్డతో గోంతుకోస్తావా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. తన మనస్సుకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుని సుఖంగా వుంటే వుండనీ.. అదే విషయాన్ని ముందుగానే తల్లిదండ్రులతో మాట్లాడి చెబితే.. అక్కడే తేలిపోయేది కదా.. ఒక అమ్మాయితో ప్రేమాయణం.. నడుపుతూ. మరో అమ్మాయితో పెళ్లి వరకు వచ్చాక.. సరిగ్గా ముహుర్తం సమయానికి  అదృశ్యం అవ్వడం సహేతుకమంటారా..?

తనకు పెళ్లి అవుతుందని చాలా ఆనందంగా భావి జీవితం గురించి కలలు కన్న వదువు.  మరికొద్ది గంటల్లో వివాహం జరగబోతుంటే ఓ చక్కటి అనుభూతిలోకి వెళ్లిపోతారు. అయితే తాళి కట్టాల్సిన  వరుడు ఏకంగా తన వివాహాన్ని వదిలేసి ప్రేమించిన అమ్మాయితో వెళ్లిపోయాడని తెలిస్తే.. ఇక్కడ అలాంటి ఘటనే చోటుచసుకుంది. ఖమ్మం జిల్లా తామేపల్లి మండలం గరిడేపల్లిలో ఉదయం 9 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా.. అంతకన్నా ముందే ఆ కాబోయే వరుడు తాను ప్రేమించిన అమ్మాయితో వెళ్లిపోయాడు. దాంతో ఇరు కుటుంబాల వారు షాక్ తిన్నారు. వరుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పెళ్లింటే నూరేళ్ల పంట అంటూ జీవితాన్ని ఊహించుకున్న వధువు, అమె సంబంధికులు మాత్రం కన్నీళ్ల పర్యంతమయ్యారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : khammam  bridegroom  marriage  girl friend  

Other Articles