Telangana | ktr | power | congress

Telangana panchayat raj minister ktr attacked on congress and former cm kiran kumar reddy

Telangana, ktr, power, congress, power, kiran kumarreddy, nallari,

Telangana Panchayat raj minister ktr attacked on congress and former cm kiran kumar reddy. He said that In telangana congress loose the power and telangana got the power.

కాంగ్రెస్ పార్టీకి పవర్ పోయింది.. తెలంగాణకు పవర్ వచ్చింది: కేటీఆర్

Posted: 05/02/2015 08:21 AM IST
Telangana panchayat raj minister ktr attacked on congress and former cm kiran kumar reddy

రాష్ట్రం విడిపోతే తెలంగాణకు కరెంటు ఎక్కడ నుంచి వస్తుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారని.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముందుచూపుతో వ్యవహరించి రాష్ట్రంలో కోతలు లేకుండా నిరంతరం విద్యుత్ ఇస్తున్నారని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.  ఆనాడు అబద్ధాలు చెప్పిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారుఅని  ఎద్దేవాచేశారు. సమైక్యరాష్ట్రంలో ఏనాడైనా ఏప్రిల్, మే నెలల్లో కరెంట్‌కోతలు లేకుండా ఉన్నాయా..స్వరాష్ట్రంలో మాత్రమే సాధ్యమైందన్నారు. వలసపాలకులు తెలంగాణపై వివక్ష ప్రదర్శించారనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి పవర్ పోయింది.. తెలంగాణకు పవర్ వచ్చిందని ఛలోక్తి విసిరారు.

గోదావరి పుష్కరాలపై అధికారులతో పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఖమ్మం జిల్లా ఇల్లెం దు నియోజకవర్గంలో రూ.30 కోట్లతో చేపట్టనున్న వివిధ రోడ్ల పనులకు ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే పంచాయతీరాజ్, అర్‌అండ్‌బీ రోడ్ల కోసం రూ.1500 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు చెప్పారు. పుష్కరాలు దగ్గరపడుతున్నందున్న పుష్కరఘాట్ల పనులను మరింత వేగవంతం చేయాలని కేటిఆర్ అధికారులను ఆదేశించారు. టెంపుల్ సిటీ భద్రాచలంలో పన్నుల వసూళ్లకు ఏర్పడుతున్న అడ్డంకులు, ఎదురవుతున్న ఇబ్బందులపై సంబంధిత కమిషనర్‌కు నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  ktr  power  congress  power  kiran kumarreddy  nallari  

Other Articles