Nepal |Earth Quake | Rishi Kanal | Suneeta sethoula

In the nepal earth quake a man drunk his urine for live

Nepal, Earth Quake, Rishi Kanal , Suneeta sethoula, Apartments,

In the Nepal Earth quake a man drunk his urine for live. Nepal earth quake smash lot of peoples lifes and familys. Recently some dark angels in the earth quake in the focus.

మూత్రమే అతని ప్రాణాలను కాపాడింది..

Posted: 04/29/2015 03:22 PM IST
In the nepal earth quake a man drunk his urine for live

నేపాల్ భూకంపం అక్కడి వారి ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించింది.. కానీ అందులో జీవితాలె ఛిద్రమైన వారి చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బతకడం కోసం మనిషి ఏదైనా చేయాల్సిందే. ప్రాణాలు నిలబెట్టుకునేందుకు మరే ఆధారం దొరకనప్పుడు ఆ వ్యక్తికి తన మూత్రమే ప్రాణదాతగా మారింది. శిథిలాల నుంచి మూడు రోజుల తరువాత ప్రాణాలతో బయటపడిన ఓ వ్యక్తి చెబుతున్న సత్యాలు వింటేనే చాలా బాధకలిగించింది. ఆ బాధను అనుభవించిన అతను ఎంతలా బాధపడి ఉంటారు.

రిషి కనాల్ అనే వ్యక్తి నేపాల్ భూకంపంలో బాగంగా కూలిన ఓ అపార్ట్ మెంట్ లో చిక్కుకున్నాడు. చూస్తుండగానే చట్టూ అంతా రక్తపుటేర్లు పారాయి..  అక్కడి నుంచి బయట పడలేని పరిస్థితి రిషి కనాల్ ది. సమయం గడుస్తోంది. సహాయం అందలేదు... చూస్తుండగానే క్షతగాత్రులు శవాలుగా మారారు రిషి కనాల్  చుట్టుపక్కల అన్నీ శవాలే. కాలం గడుస్తోంది ఆకలి.. దప్పిక వేస్తోంది.. నోరు పెళుసుబారిపోతోంది.. పెదవులు పగిలిపోతున్నాయి... కళ్లు మూతలు పడిపోతున్నాయి... మరణ భయం అంటే ఏమిటో  రిషి కనాల్ కు అనుభవంతో తెలిసింది. నీరైనా తాగకపోతే చనిపోతానని అతనికి అర్థమైంది. విధి లేక తనమూత్రాన్ని తానే తాగాల్సి వచ్చింది. అదే అతని ప్రాణాన్ని నిలబెట్టింది. 82 గంటల తరువాత సహాయక బృందాలు శిథిలాలు తొలగించి అతన్ని బయటకు తీశాయి.

ఇలాంటి వ్యథాభరిత వాస్తవ గాధలెన్నో నేపాల్ భూకంపబాధిత ప్రాంతాలనుంచి వెలుగులోకి వస్తున్నాయి. భూకంప శిథిలాల్లో చిక్కుకున్న ఓ మహిళ 50గంటలపాటు మృత్యువుతో పోరాడింది. చివరికి ఆమె పోరాటం ఫలించి మృత్యుంజయురాలిగా బయటపడింది. నేపాల్‌లోని మహారాజ్‌గంజ్ ప్రాంతానికి చెందిన సునీతా సితౌలా ఓ అపార్ట్ మెంట్ లో నివాసముంటోంది. గత శనివారం నేపాల్ దేశాన్ని కకావికలం చేసిన భూకంప ధాటికి సునీత ఉంటున్న భవనం కూలిపోయింది. శిథిలాల్లో చిక్కుకున్న ఆమె అధైర్యపడకుండా సహాయం కోసం ఎదురుచూసింది. దాదాపు రెండు రోజులపాటు శిథిలాల్లో ఉన్న ఆమెను రెస్క్యూ సిబ్బంది మంగళవారం ప్రాణాలతో బయటకు తీశారు. చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న సునీత మాట్లాడుతూ ప్రాణాల కోసం పోరాడి బతికిన తనకు ఇప్పుడు నేపాల్‌ను చూస్తుంటే మరో ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లుగా ఉందని పేర్కొన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nepal  Earth Quake  Rishi Kanal  Suneeta sethoula  Apartments  

Other Articles