Rahul gandhi | congress | panjab | telangana

Rahul gandhi boosting congress with the landbill issue

rahul gandhi, congress, panjab, telangana, farmers, landbill

Rahul Gandhi boosting congress with the landbill issue.. Congress vice president Rahul Gandhi took a train to Punjab today to visit the state's mandis or grain markets, where farmers are struggling to sell their produce after the recent unseasonal rains.

రాహుల్ గాంధీ వస్తే జంక్షన్ జామ్ కావాల్సిందే

Posted: 04/29/2015 11:21 AM IST
Rahul gandhi boosting congress with the landbill issue

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హాలీడే తర్వాత ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నారు. వచ్చీరాగానే కిసాన్‌ ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌... ఆ తర్వాత భూసేకరణ బిల్లు వల్ల రైతులకు కలిగే నష్టంపై పార్లమెంట్‌లో గళం విప్పారు. ఇప్పుడు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రత్యక్షంగా వారి వద్దకే వెళ్లాలని నిర్ణయించిన రాహుల్‌... పంజాబ్‌ పర్యటన చేపట్టారు. సుమారు రెండు నెలల విరామం తర్వాత స్వదేశం తిరిగి వచ్చిన రాహుల్‌ గాంధీలో కొత్త కళ కనిపిస్తోంది. అదే సమయంలో భూసేకరణ బిల్లు కాంగ్రెస్‌కు వరంగా పరిణమించింది. ఆ బిల్లును అస్త్రంగా చేసుకున్న రాహుల్‌... కాంగ్రెస్‌కు పూర్వ వైభవాన్ని తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. భూసేకరణ బిల్లును పార్లమెంట్‌లో తీవ్రంగా వ్యతిరేకించిన రాహుల్‌... ఇప్పుడు నేరుగా రైతుల వద్దకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యక్షంగా రైతుల సమస్యలను తెలుసుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఢిల్లీ రైల్వే స్టేషన్‌ వెళ్లి సచ్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఓ జనరల్‌ బోగీ ఎక్కి కూర్చున్నారు. ప్రయాణికులతో ముచ్చటించారు.

అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల సమస్యలు తెలుసుకోవడంతోపాటు... భూసేకరణ బిల్లుపై రైతులు ఏమను కుంటున్నారో తెలుసుకోవడానికే పంజాబ్‌ పర్యటన చేపట్టానని తెలిపారు. పంజాబ్ ధాన్య భాండాగారంగా పేరుపొందిన గోవింద్గఢ్, అంబాలా ప్రాంతాలతోపాటు ప్రసిద్ధ ఖన్నా మండీని సందర్శించిన రాహుల్‌.. పంట నష్టంతో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించారు. దేశానికి అన్నంపెట్టే రైతుల భూమిని లాక్కునేందుకు భూసేకరణ సవరణ చట్టం తెస్తోందని కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు మాత్రం రాహుల్‌ యాత్రను కొట్టిపారేశారు. రాహుల్‌ను పార్ట్‌టైమ్‌ పొలిటీషియన్‌గా అభివర్ణించారు. అయితే రైతు వ్యతిరేకి అయిన బీజేపీ రాహుల్‌ను రైతు వ్యతిరేకిగా పేర్కొనడం హాస్యాస్పదమని కాంగ్రెస్‌ నేతలు ఎద్దేవా చేశారు. ఏదేమైనా... భూసేకరణ బిల్లుపై వస్తున్న వ్యతిరేకతను క్యాష్‌ చేసుకోవాలని.. కాంగ్రెస్‌కు పునరుజ్జీవం తీసుకురావాలని రాహుల్‌ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

మరోపక్క తెలంగాణలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన తేదీలు  ఖరారయ్యాయి. వచ్చే నెల 9,10 తేదీల్లో ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు.  పంటలు నష్టపోయిన రైతులను రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లేదా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ సెగ్మెంట్ నుంచి ఆయన పాదయాత్ర చేసే అవకాశం ఉంది. రాహుల్ పర్యటన షెడ్యూల్ కోసం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. రైతుల ఆత్మహత్యలు, వడగళ్లతో ఎక్కువ నష్టం జరిగిన ప్రాంతాల్లో రాహుల్‌గాంధీ సుమారు 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. కాగా రాహుల్  ప్రస్తుతం పంజాబ్లో పర్యటిస్తున్నారు. రైతులను ఆయన పరామర్శిస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  congress  panjab  telangana  farmers  landbill  

Other Articles