Telangana ministers | chicken mela | Bird flu | Nizam college

Telangana minister campigning about birdflu in hyderabad

Telangana ministers, chicken, chicken mela, bird flu, nizam college,

Telangana minister campigning about birdflu in hyderabad. Telangana ministers Nayine, Eetela, Jadadeshwar Reddy participated in chicken mela at nizam college, hyderabad.

ప్రచారం పేరుతో చికెన్ ను బాగా లాగించేసిన మంత్రులు

Posted: 04/29/2015 08:21 AM IST
Telangana minister campigning about birdflu in hyderabad

చికెన్ తినండి.. భయం లేదు అని ప్రచారం చెయ్యడం కోసం తెలంగాణ మంత్రులు తెగ సంబర పడుతున్నారు. ఇంతకీ సంబరం ఎందుకు అనుకుంటున్నారా.. ప్రచారం పేరుతో మన మంత్రివర్యులు చికెన్ ను బాగా లాగించేస్తున్నారట. ఓ వైపు చికెన్ పై ప్రచారం.. మరో వైపు రుచికరమైన చికెన్ ఇలా రెండూ కలిసి వస్తున్నాయి మరి. దీన్నే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటారేమో.  ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో 'చికెన్, ఎగ్ మేళా'ను నిర్వహించారు. ఆలిండియా పౌల్ట్రీ డెవలప్‌మెంట్ అండ్ సర్వీసెస్, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (నెక్), తెలంగాణ స్టేట్ పౌల్ట్రీ ఫెడరేషన్ (టీఎస్‌పీఎఫ్), తెలంగాణ పౌల్ట్రీ, బ్రీడర్స్ (పీబీఏ-టి)లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. వందలాది మంది ప్రజలు తరలిరాగా, ప్రతి ఒక్కరికీ ఉచితంగానే కోడి మాంసం, గుడ్డుతో చేసిన వంటకాలను రుచి చూపించారు.

భూకంపం నేపాల్‌ను.. 'బర్డ్‌ఫ్లూ' పౌల్ట్రీ పరిశ్రమను కుదిపేశాయని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చికెన్, గుడ్లు తింటే బర్డ్‌ఫ్లూ రాదని ఆయన స్పష్టం చేశారు.పౌల్ట్రీ పరిశ్రమ పుట్టిందే హైదరాబాద్‌లో. ఈ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకుంటుందని ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఇప్పటికే 24 గంటలు విద్యుత్‌ను ఇస్తున్నామని యూనిట్‌కు రూ.2 రాయితీ ఇస్తున్నాని అన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తాను చికెన్ ప్రియుడినని. చికెన్, గుడ్లు ఎక్కువగా తింటానని. తక్కువ ధరకు దొరికేది, అత్యంత ఎక్కువగా పోషకాలు ఉండేది చికెన్‌లోనే అన్నారు.  చికెన్ జిందాబాద్! రేపటి నుంచి నిరభ్యంతరంగా చికెన్, గుడ్లు తినండ' అన్నారు.  పౌల్ట్రీ పరిశ్రమ బీదలకు సేవ చేస్తోందన్నారు మంత్రి జగదీష్‌రెడ్డివెల్లడించారు. మొత్తానికి మీడియా ఫోటోలకు ఫోజులు ఇస్తూ కమ్మని చికెన్ ను కుమ్మేశారు మంత్రులు.

(Source: Eenadu)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana ministers  chicken  chicken mela  bird flu  nizam college  

Other Articles