Pamela Anderson urges Kerala CM not to parade elephants at Thrissur Temple Festival

Pamela anderson reaches out to save kerala jumbos

kerala chief minister, oommen chandy, cochin dewaswom, pamela anderson, thrissur elephant festival, actress pamela anderson, peta, ooman chandy, pamela anderson ooman chandy, thrissur pooram parade, pamela anderson elephants, pamela anderson letter, pamela anderson mail to cm, elephants at pooram day, pooram day, pooram day festival, entertainment news

As the stage is set for Kerala's iconic festival Thrissur pooram, Hollywood actress Pamela Anderson has written to Kerala Chief Minister Oommen Chandy asking him no to the use elephants for the festival.

హాలీవుడ్ నటి అభ్యర్థనను తోసిపుచ్చిన ముఖ్యమంత్రి

Posted: 04/28/2015 04:59 PM IST
Pamela anderson reaches out to save kerala jumbos

ప్రముఖ హాలీవుడ్ నటి, బేవాచ్ స్టార్, జంతు హక్కుల ఉద్యమకర్త పమేలా అండర్ సన్  అభ్యర్థనను కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ తోసిపుచ్చారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని తాము కాదనలేమని తేల్చిచెప్పారు. చారిత్రక త్రిస్సూర్ పూర్ణమ్ ఉత్సవాలలో ఏనుగులకు బదులుగా వెదురు బొంగు, కాగితపుగుజ్జుతో తయారు చేసిన బొమ్మలని ఉపయెగించాలని కోరిన పమేలా అండర్ సన్ విజ్ఞప్తిని ఉమెన్ చాందీ తోసిపుచ్చారు. మూగజీవులను హింసించడం వేరు, పండుగలకు, దేవాతామూర్తాల ఉత్సవాలకు వాటిని వినియోగించడం వేరని ఆయన చెప్పారు.

పమేలా అండర్ సన్ నుంచి తనకు ఈ మెయిల్ అందిందని చెప్పిన ఆయన..  ఏనుగుల వినియోగంపై చూపిన అమెకున్న శ్రద్దను అభినందిస్తూనే.. తాము ఏనుగుల అంబారీపై దేవతామూర్తుల విగ్రహాల ఊరేగింపులో నిబంధనలకు అనుగూనంగానే వ్యవహరిస్తామన్నారు. తమ రాష్ట్ర జంతువుల చట్టంలో వున్న నిబంధనల మేరకు వాటిని ఉత్సవాలు, పండుగలలో వినియోగిస్తామన్నారు. అయితే మూగజీవాలను హింస జరుగుతుందంటూ అమె వ్యక్తం చేసిన ఆవేదనకు ఇక్కడ అస్కారం లేదన్నారు. ఏనుగులను ఎవరూ హింసించరని అన్నారు. ఇక ఏనుగులను దేనికీ వినియోగించరాదన్న పమేలా అండర్ సన్ వాదనను కూడా ఉమెన్ చాందీ తోసిపుచ్చారు. ఇది భక్తుల విశ్వాసాలతో కూడకున్నదని, దీనిపై ఇంతకుమించి తాను మాట్లాడనని చెప్పారు.

ఈ నెల 29న జరుగనున్న చారిత్రక త్రిస్సూర్ పూర్ణమ్ ఉత్సవాలలో ఏనుగులకు బదులుగా వెదురు బొంగు, కాగితపుగుజ్జుతో తయారు చేసిన బొమ్మలని ఉపయెగించాలని కోరుతూ పమేలా అండర్ సన్..కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, కోచ్చి దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్కు ఈ మెయిల్ చేసింది. ఏనుగులని గొలుసులతో కట్టేసి, బలవంతంగా ఎండలో తిప్పడం వల్ల అక్కడికి వచ్చే పర్యాటకులు కూడా అసౌకర్యానికి గురి అవుతారని అందులో పేర్కొంది. నిర్భందించి ఏనుగులని ఉపయోగించడాన్ని భారత్తో పాటూ అంతర్జాతీయంగా ఉన్న ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం మీకు తెలిసిందే..అని ముఖ్యమంత్రికి రాసిన లేకలో పమేలా అండర్ సన్ పేర్కొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pamela anderson  thrissur elephant festival  

Other Articles