Lady Lodges Complaint Against Producer Kalyan

Tollywood cine producer c kalyan arrest

tollywood, C Kalyan, jubilee hills, Ram Gopal Varma, Kavitha, cine producer, Controversy, Metro rail, Kalyan in controversy with a lady, Kanchana 2 C Kalyan is busy with the releasing works of his upcoming film Uttama Villain. The Kamal Haasan-starrer

Telugu producer C Kalyan, who has been in news for wrong reasons, is at it again. A police complaint has been lodged against C Kalyan for allegedly attacking a lady doctor. A lady doctor has approached cops and filed a complaint against the controversial producer accusing him of attacking her.

మరో వివాదంలో సినీ నిర్మాత సి.కళ్యాణ్.. కేసు నమోదు

Posted: 04/28/2015 01:21 PM IST
Tollywood cine producer c kalyan arrest

సినీ నిర్మాత సి.కళ్యాణ్‌ మరోసారి వార్తల్లోని వ్యక్తిగా మారాడు. అయితే ఏదో వివాదాస్పద చిత్రాన్ని ఆయన నిర్మిస్తూండటమే ఇందుకు కారణమనుకుంటే పోరబాటే. పై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. మద్దెల చెర్వు సూరీ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కుని 3011 జూన్ 30న అరెస్టు అయ్యి వార్తల్లోని వ్యక్తిగా మారిన కళ్యాణ్ మరోమారు అలాంటి వ్యవహారంలోనే అరెస్టయ్యారు. మెట్రో నష్టపరిహారం మొత్తం అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌కే ఇవ్వాలని సి.కళ్యాణ్‌ ఒత్తిడి తెస్తున్నాడని డాక్టర్‌ కవిత అనే మహిళ పోలీసులను ఆశ్రయించారు. ఫ్లాట్‌ను తనకే అమ్మాలని బెదిరిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు.

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 5లో గల ఓ ఫ్లాట్‌ విషయంలో గత కొద్దిరోజులుగా డాక్టర్‌ కవిత, సి.కళ్యాణ్‌ మధ్య వివాదం నెలకొంది. ఆ ఫ్లాట్‌ మార్గంలో మెట్రోరైలు వెళ్తున్న నేపథ్యంలో అపార్ట్‌మెంట్‌ కొంత మేరకు పోయే అవకాశం ఉంది, అందుకు జీహెచ్‌ఎంసీ నష్టపరిహారాన్ని చెల్లించేందుకు సిద్ధమైంది. అయితే వచ్చే నగదును వ్యక్తిగతంగా కాకుండా ఫ్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌లో వేయమని సి.కళ్యాణ్‌ అనగా, అందరికి వేరువేరుగా ఇవ్వాలని కవితతో పాటు మరో ఐదుగురు తెలిపడంతో వివాదం చెలరేగింది. అంతేకాకుండా కవితకు సంబంధించిన ఫ్లాట్‌ను కూడా తనకే అమ్మాలంటూసి.కళ్యాణ్‌ బెదిరింపులకు దిగాడు. దీంతో కవిత జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించడంతో సి.కళ్యాణ్‌పై 506, 509, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood  C Kalyan  jubilee hills  Ram Gopal Varma  Kavitha  

Other Articles