Nepal earthquake: Buildings collapse in Kathmandu after 7.9 magnitude quake in Pokhara, witnesses say

Strong earthquake rocks nepal damages kathmandu

earth quake, india, delhi, bihar, gawhathi, , Seviour earth quake in nepal people, earthquake, nepal, Dharahara Tower, Bhimsen Tower, disasters-and-accidents, nepal, Buildings collapse in Kathmandu, earthquake rattles Nepal, earthquake rattles Kathmandu,

A powerful earthquake has rocked central Nepal, causing extensive damage to buildings and some injuries, eyewitnesses say.

నేపాల్ కాకావికళం..కుప్పకూలిన భవనాలు, ఆలయాలు

Posted: 04/25/2015 03:01 PM IST
Strong earthquake rocks nepal damages kathmandu

ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన నేపాల్ దేశంపై ప్రకృతి తన ప్రకోపాన్ని చాటింది.  శనివారం ఉదయం ప్రకృతి ప్రళయకార నత్యం చేయడంతో సంభవించిన భూకంపానికి నేపాల్ కాకావికళమైంది. రెక్టార్ స్కేలుపై 7.9 తీవ్రతతో సంబవించిన భూకంపానికి నేపాల్ లోని అనేక భవన సముదాయాలు, నివాస సముదాయాలు నెలమట్టమయ్యాయి. రాజధాని ఖట్మాండ్తో సహా పరిసర ప్రాంతాల్లో భూకంపం బీభత్సం సృష్టించింది. నేపాల్ కేంద్రంగా ఖట్మాండుకు 83 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది.  నేపాల్ లాంజంగ్ ప్రాంతంలో భూప్రకంపనలు అధికంగా నమోదు అయ్యాయి.

మరోవైపు భూ ప్రకంపనల ధాటికి ఖాట్మండు విమానాశ్రయాన్ని మూసివేశారు. దుమ్ముధూళితో ఖాట్మాండ్ నిండిపోయింది. అలాగే నేపాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థపై కూడా ప్రభావం చూపింది. టెలికమ్ సేవలు నిలిచిపోయాయి.  కాగా నేపాల్లో ఇప్పటివరకూ ఒకరు మృతి చెందినట్లు సమాచారం. భూకంప తీవ్రతతో పురాతన భవనం కూలి ఆ వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు నేపాల్ సరిహద్దు రాష్ట్రాల్లో భూకంప ప్రభావం తీవ్రమని అధికారులు అంచనా వేస్తున్నారు.

కూలిన చారిత్రక ధరహరా భీమ్సేన్ శిఖరం

ఖాట్మండ్‌లోని చారిత్రక ధరహరా భీమ్సేన్ శిఖరం కుప్పకూలింది. ఈ శిఖరం  కింద సుమారు 500 మంది చిక్కుకున్నట్లు సమాచారం. వారిని వెలికి తీసేందుకు రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టారు. 19వ శతాబ్దంలో నిర్మించిన ఈ శిఖరం భూ కంపం ధాటికి శిధిలంగా మారింది. రాజధాని ఖట్మాండు సహా అనేక ప్రాంతాల్లో భూ కంపం  అంచనాలకు అందనంతగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. భారీగా ప్రాణా, ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

నేపాల్లోని లామ్జంగ్లో మరోమారు 11. 40 నిమిషాలకు మరోమారు భూకంపం సంభవించింది.  నేపాల్‌లోని భరత్‌పూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.1గా నమోదు అయ్యింది. మరోవైపు నేపాల్ రాజప్రసాదానికి కూడా పగుళ్లు ఏర్పడ్డాయి.  భూకంప తీవ్రతతో భవనాలు, గృహ సముదాయాలు, పురాతన ఆలయాలు, చారిత్రక కట్టడాలు నేలమట్టం అయ్యాయి. దీంతో నేపాల్ మొత్తం దుమ్ము,ధూళితో నిండిపోయింది. చాలా ప్రాంతాల్లో రహదారులు ధ్వంసం అయ్యాయి. కట్టుబట్టలతో రోడ్లపైకి చేరిన జనాలు ఎక్కడికి వెళ్లాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఉన్నారు..
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : disasters-and-accidents  earthquake  nepal  Bhimsen Tower  

Other Articles