AP | TS | Vehicles | Tax | Toll

Andhra pradesh govt intrduce new tax on telangana vehicles in its state

andhra pradesh, telangana, vehicles, tax, entry tax, toll, chandrababu, kcr,

Andhra pradesh govt intrduce new tax on telangana vehicles in its state. Telangana govt alredy collecting tax from ap vehicles in telangana. On this situation Ap govt decided to collect tax from TS vehicles.

తెలంగాణ బండి.. ఐతే పన్ను కట్టు

Posted: 04/25/2015 08:37 AM IST
Andhra pradesh govt intrduce new tax on telangana vehicles in its state

అనుకున్నంతా అయ్యింది.. తెలంగాణ నుండి వచ్చే వాహనాలపై పన్ను వెయ్యాలని ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చెయ్యడం.. అర్దరాత్రి నుండి అమలు టకటకా జరిగిపోయాయి. తాజా ఉత్తర్వులకు అనుగుణంగా చెక్ పోస్టుల వద్ద తెలంగాణ వాహనాల నుంచి ప్రవేశ పన్ను వసూలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ఎంట్రీ ట్యాక్స్ విధానాన్ని అమలు చేసింది. తెలంగాణలో ప్రవేశించే ఏపీ వాహనాలపై పన్ను విధించింది. ఈ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం కావడం, ఉపసంహరణకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించక పోవడంతో.. అప్పట్లోనే ఏపీ ప్రభుత్వం కూడా ప్రవేశ పన్నును అమలు చేద్దామని భావించింది. రవాణా శాఖ అధికారులకు.. ఆ మేరకు లెక్కలు తీయాలని, ఏ మేరకు ఆదాయం లభిస్తుందో పరిశీలించాలని ఆదేశాలిచ్చింది. తెలంగాణ కంటే ఏపీకి తక్కువ ఆదాయం వస్తుందని తేలడంతో వెనక్కు తగ్గింది. పన్ను ఉపసంహరణపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖలు, చర్చలు అంటూ హడావుడి చేసినా ఫలితం లేకపోవడంతో   రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు కేంద్ర రవాణా మంత్రి గడ్కారీకి ఫిర్యాదు చేశారు. ఇందులో తాము జోక్యం చేసుకోబోమని గడ్కారీతో పాటు మరో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌లు స్పష్టం చేశారు. మరోవైపు ఏపీ ప్రైవేట్ బస్ ఆపరేటర్ల సంఘం, లారీ యజమానుల అసోసియేషన్‌లు కోర్టులను ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు కనీసం పిటిషన్‌ను స్వీకరించడానికి కూడా నిరాకరించింది.

ఈ నేపథ్యంలోనే.. తెలంగాణకు చెందిన వాణిజ్య వాహనాలు, లారీలు, స్టేజి క్యారియర్లుగా తిరిగే బస్సులు రాష్ట్రంలో ప్రవేశిస్తే పన్ను విధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ పర్యటన కారణంగా నిర్ణయం అమలు కొంతకాలం వాయిదా పడినా.. శుక్రవారం ఆ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. తెలంగాణ ప్రాంతం నుంచి కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు గ్రానైట్ లారీలు తిరుగుతుండటం, తిరుమల, శ్రీశైలం క్షేత్రాలకు ఆ రాష్ట్రం నుంచి భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉన్నందున.. ఎంట్రీ ట్యాక్స్ ద్వారా నెలకు నాలుగైదు కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఏపి ప్రభుత్వం వినతిని స్వీకరించకుండా కేవలం రాష్ట్రానికి ఆదాయం వస్తుందని.. ఏపి నుండి వచ్చే వాహనాలపై పన్ను బాదుడుకు సిద్దమైంది. దాంతో  ఏపి కూడా ఖజానాను నింపుకునేందుకు, తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇవ్వడానికి అన్నట్లు కొత్తగా తెలంగాణ వాహనాలపై పన్నును ప్రవేశపెట్టింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhra pradesh  telangana  vehicles  tax  entry tax  toll  chandrababu  kcr  

Other Articles