Delhi Police send Gajendra Singh's suicide note for forensic tests

Doubts over gajendra singhs suicide note

doubts over gajendra singhs suicide note, Delhi Police send Gajendra Singh's suicide note for forensic tests, Rahul gandhi, Aravind kejriwal, Aam Aadmi Party, AAP, AAP rally, Agriculture, BJP, Congress, land bill, Delhi, farmers, India, Jantar Mantar, Land Acquisition Bill, PM Narendra Modi, gajendra singh,

Delhi Police investigating the suicide of farmer Gajendra Singh has sent his alleged suicide note to forensic experts to ascertain whether it was actually written by him or not.

అది గజేంద్రుడి చేతిరాత కాదు.. సూసైడ్ నోట్ పై అనుమానాలు..

Posted: 04/23/2015 09:50 PM IST
Doubts over gajendra singhs suicide note

హస్తినలో జరిగిన ఆప్ ధర్నాలో అసువులు బాసిన రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ కళ్యాణ్‌వత్ ఆత్మహత్య సంఘటనలో కొత్తకోణం వెలుగుచూసింది. రాజకీయ రంగు పులుముకున్న ఈ ఆత్మహత్యకు ముందు గజేంద్ర రాసినట్టు చెబుతున్న సూసైడ్ నోట్ అసలు ఆయనది కాదని, ఆ నోటులోని రాతకు, ఆయన చేతిరాతకు సంబంధం లేదని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు. పైగా ఆ నోటు రాజకీయ పరిభాషలో ఉందని, ఎక్కడా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు గజేంద్ర పేర్కొనలేదని స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలకు హాజరైన కుటుంబ సభ్యులు తెలిపారు.

దౌసా జిల్లాలోని నంగల్ జమర్‌వాడ గ్రామంలో గురువారం కుటుంబ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకుల సమక్షంలో గజేంద్రసింగ్ అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగానూ రాజకీయ నినాదాలు వినిపించాయి. టెలివిజన్‌లో గజేంద్ర రాసినట్టు చెబుతున్న సూసైడ్ నోటును చూశామని, ఆ చేతి రాత ఆయనది కాదని ఐదుగురిలో నాలుగో సోదరి అయిన రేఖా కన్వర్, గజేంద్ర మామ గోపాల్ సింగ్ మీడియాకు తెలిపారు. గజేంద్ర తమ్ముడు విజేంద్ర సింగ్ మాత్రం సూసైడ్ నోట్ గజేంద్ర రాశారా, లేదా? అన్న విషయం జోలికి వెళ్లకుండా, అసలది సూసైడ్ నోటులా లేదని చెప్పారు.

అందులో తన తండ్రితో ఉన్న గొడవలను ప్రధానంగా ప్రస్తావించాడే తప్ప ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఎక్కడా చెప్పలేదని వ్యాఖ్యానించారు. బహూశ తాను ఇవ్వదల్చుకున్న ఉపన్యాసం గురించి నాలుగు ముక్కలు రాసుకున్నాడో, ఏమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘అకాల వర్షాల కారణంగా పంటకు నష్టం ఏర్పడడంతో తన తండ్రి తనను ఇంట్లోకి రావద్దన్నాడు. తనకు ముగ్గురు పిల్లలు., తాను ఎలా ఇంటికి వెళ్లగలనని ఆ లేఖలో ఉంది. సూసైడ్ నోటు గజేంద్రనే రాశారా, లేదా అన్న విషయాన్ని  నిర్ధారించుకోవడానికి ఆ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gajendra singh  farmer suicide  suicide note  

Other Articles