Rahul gandhi | Congress | NDA | Modi | Return

After return rom the long tour changes in rahul gandhi behavour

rahulgandhi, congress, tour, long leave, rest, congress, sonia gandhi, modi, nda, land bill, net neutriality

After return rom the long tour changes in rahul gandhi behavour. The congress vice president went long tour to unknown place, after his return, congress got boost andalso rahul.

రెచ్చిపోతున్న రాహుల్.. టూర్ తర్వాత మార్పే మార్పు

Posted: 04/23/2015 08:15 AM IST
After return rom the long tour changes in rahul gandhi behavour

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అజ్ఞాతం వీడి స్వదేశానికి తిరికి వచ్చినప్పటి నుండి ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. రాజకీయంగా ఎదిగేందుకు తన ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాహుల్ చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆనందం కలిగిస్తున్నాయి. బుధవారం లోక్‌సభలో అంతర్జాలం తటస్థవైఖరి గురించి వాదిస్తుంటే సోనియా ఆయనవైపు గర్వంగా చూస్తుండిపోయారు. రాహుల్ గాంధీలో రాజకీయంగా ఆత్మవిశ్వాసం పెరగటం పట్ల సోనియా గాంధీ సంతృప్తితో ఉన్నారు.

అజ్ఞాతవాసం రాహుల్‌లో పెనుమార్పు తెచ్చింది. స్వదేశానికి వచ్చిన వెంటనే రైతుల ర్యాలీ నిర్వహించి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వంపై విరుచుకుపడిన రాహుల్ బుధవారం అంతర్జాలం తటస్థవైఖరి అంశంపై లోక్‌సభలో మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసేందుకు ప్రయత్నించారు. ఈ అంశంపై మాట్లాడిన ఆయన దేశంలోని యువత అభిమానాన్ని చూరగొనేందుకు ప్రయత్నించారు. అంతర్జాలం తటస్థ విధానంకోసం దేశంలోని దాదాపు పది లక్షల మంది యువకులు అంతర్జాలంపై సంతకాల సేకరణ జరిపారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రభుత్వం నుండి సమాధానం రాబట్టటం ద్వారా ఆ యువకులకు నాయకుడుడైపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన రైతుల ధర్నాలో రాజస్థాన్‌కు చెందిన ఒక రైతు చెట్టుకు ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం సాయంత్రం లేడీ హార్డింగే ఆసుపత్రికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న రైతు భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించి వచ్చారు. గతంలో రాహుల్ గాంధీ ఎప్పుడు ఇలా వ్యవహరించిన దాఖలాలు లేవు. లోక్‌సభలో ఎప్పుడు ఆఖరు వరుసలో కూర్చునే రాహుల్, రెండో విడత సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి రెండో వరుసలో కూర్చుని సభా కార్యక్రమాలను పరిశీలించటంతోపాటు పార్టీ ఎంపీలకు పరిస్థితుల ఆధారంగా సూచనలు ఇస్తూ ఉత్సాహ పరుస్తున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టనున్న రాహుల్ అనతి కాలంలోనే లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడి పదవి చేపట్టినా ఆశ్చర్యపోనక్కరలేదు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahulgandhi  congress  tour  long leave  rest  congress  sonia gandhi  modi  nda  land bill  net neutriality  

Other Articles