Chiranjeevi & Sridevi to pair up once again for Chirus 150th film

Heroine finalise in chiranjeevi 150th film

Chiranjeevi Sridevi to pair up once again for Chiru’s 150th film, Chiranjeevi, Chiranjeevi news, Chiranjeevi latest news, Chiranjeevi updates, Chiranjeevi latest updates, Chiranjeevi movie updates, Chiranjeevi latest movie updates, tollywood news, entertainment news, mega fans

Countless fans of Megastar Chiranjeevi are eagerly waiting to watch their favorite idol on screen. Chiranjeevi has given green signal for his 150th film but he is waiting for the right script. Puri Jagannadh is likely to direct this movie and BVS Ravi will provide the script.

చిరు 150వ చిత్రంలో జతకట్టనున్న అతిలోక సుందరి..!

Posted: 04/22/2015 10:25 PM IST
Heroine finalise in chiranjeevi 150th film

టాలీవుడ్లో ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న 150వ సినిమాలో హీరోయిన్ ఖరారైనట్లు ఓ వార్త శిఖార్లు కోడుతోంది. చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రోడక్షన్‌ పనులు కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. మెగాస్టార్తో జోడీ కట్టబోయే ఆ లక్కీ హీరోయిన్ ఎవరో తేలిపోయింది. ఆ సీక్రెట్ రివీల్ అయ్యేసరికి మెగాఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటారా..? అత్యంత అరుదుగా లభించిన ఈ చాన్స్ ను కోట్టేసిన అందాల బామ ఎవరంటారా..?

అందాల బామ కాదండీ.. ఏకంగా అతిలోక సుందరి.. మీకు కాస్తా వెలిగినట్లుంది కదూ.. అవును.. అమె. చిరు 150వ చిత్రానికి మొన్నటి వరకు కొత్త హిరోయిన్‌ను తీసుకొవాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు చెక్కుచెదరని అందంతో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్న బ్యూటీ  శ్రీదేవిని.. చిరంజీవి సరసన నటించే అవకాశం ఉందని అంటున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు టాలీవుడ్లో బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. 1990 దశకం చివరిలో సుప్రీం హీరో చిరంజీవి, ఆనాటి అందాల నటి శ్రీదేవి జంటగా నటించిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మళ్ళీ అదే కాంబినేషన్‌ను రిపీట్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మెగా ఫ్యాన్స్‌కి చిరంజీవి మళ్లీ కిక్ ఇస్తాడా?  అందుకు తగ్గట్టుగా శ్రీదేవి అభినయం చేయగలుగుతుందా..? చిరు మూవీకి ముహూర్తం ఎప్పుడు? స్పెషల్ ఎప్పిరియన్స్ గా ఎంత మంది కనిపిస్తున్నారు? లాంటి విషయాలపై సినిమా వర్గాలలో ఆస్తకి నెలకొంది. ఇండస్ట్రీతో పాటు అంతటా ఇదే చర్చ.చిరు 150వ సినిమాకి హైప్ క్రియేట్ కావాలంటే కచ్ఛితంగా గ్లామర్ క్రేజ్ ఉండాల్సిందే అని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను శ్రీదేవితో ఇప్పటికే మాట్లాడినట్లు, అగ్రిమెంట్కు సంబంధించిన పనులను కూడా పూర్తి అయినట్లుగా టాక్స్ వినిపిస్తున్నాయి. అదే నిజమైతే.. మెగాఫ్యాన్స్కు పండగే పండగ.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjivi  chiranjivi 150th film  Sridevi  

Other Articles