Intelligence | Police | Attacks | Terrorists

Intelligence sources warning to police on terrorists attacks

Intellegence, IB, police, terrorists, nalgonda, encounter, vikarudin, telangana,

Intelligence sources warning to police on terrorists attacks. Terrorists may attacks on the encounter of vikarunnid gang. The police officials also alerted on the IB warning.

పోలీసులూ.. బీ కేర్ ఫుల్.. హెచ్చరించిన నిఘా వ్యవస్థ

Posted: 04/22/2015 02:48 PM IST
Intelligence sources warning to police on terrorists attacks

ఉగ్రవాదులు తెలంగాణ రాష్ట్రంపై గురిపెట్టారా? పోలీసులే టార్గెట్‌గా కుట్ర పన్నుతున్నా రా? అంటే నిఘా వర్గాల నుంచి అవుననే సమా ధానమే వస్తోంది. పాకిస్తాన్‌ కేంద్రంగా మన దేశం లో దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నారని ఇప్పటికే ఇంటలిజెన్స్‌వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి పోలీసులే టార్గెట్‌గా ఉగ్రమూకలు వ్యూహం పన్నుతున్నట్టు నిఘావర్గాలు పదేపదే హెచ్చరికలు చేస్తూ న్నాయి. గత ఏడాది ఇదే తరహాలో హెచ్చరించినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం వహించడంతో దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లు చోటుచేసుకున్నాయని విమర్శ వుండనే వుంది. దీంతో గత అనుభవాలను దృష్టిలో పెటుకున్న పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.

సిమీ ఉగ్రవాదులపై పోలీసులు చేసిన దాడులకు ప్రతిదాడులు జరిగే అవకాశాలున్నాయని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. వికారుద్దీన్‌ గ్యాంగ్‌తోపాటు జానకీపురం ఎన్‌కౌంటర్లకు ప్రతీకారం తీర్చుకునేందుకు సిమీ, ఇండియన్‌ ముజాహిదీన్‌ లు విధ్వంసాలకు తెగబడే అవకాశం వుంది. పాకిస్తాన్‌ నుంచే ప్రతిదాడుల వ్యూహ రచన చేస్తున్నట్లు నిఘావర్గాల దర్యాప్తులో వెల్లడయ్యింది. ఈ విషయమై కొన్ని ఫోన్‌ సంభాషణలు కూడా జరిగినట్టు కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ గుర్తించింది. తెలంగాణ పోలీసుల చేతుల్లో మృతిచెందిన ఎయిజాజుద్దీన్‌, అస్లాంలు ఇండియన్‌ ముజాహిద్దీన్‌ సంస్థకు పలు రకాలుగా ఉపయోగపడడంతో పాటు, కీలక సమాచారాన్ని అందించేవారు. కీలకమైన ఈ ఇద్దరితోపాటు వికారుద్దీన్‌ గ్యాంగ్‌ను కోల్పోవడంతో ఉగ్రవాదులు పోలీసులను టార్గెట్‌ చేసుకున్నారు.

అయితే పోలీసులపై ఆపరేషన్‌ చేపట్టే ముందు ఉగ్రవాదులు తమకు అనుకూలంగా వుండే ప్రాంతాలను ఎంపిక చేసుకొని అడ్డా వేస్తున్నారు. డబ్బులు సమకూర్చుకునేందుకు ప్రధానంగా దోపిడీలు, భారీ దొంగతనాలు చేస్తున్నారు. ఇందులో భాంగానే అస్లాం, జకీర్‌లు గత ఏడాది కరీంనగర్‌ జిల్లా చొప్పదండి ఎస్‌బీఐలో భారీ దోపిడీ చేశారు. ఇదే తరహాలో వీళ్లు దేశంలోని మరికొన్ని చోట్లా నేరాలకు పాల్పడ్డారని ఇంటెలిజెన్స్‌ సమాచారం సేకరించింది. వీరికి సహకరించిన వారిపై దృష్టి సారించింది. ఉగ్రవాదులు ఏ సమయంలోనైనా దాడులకు తెగబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు పోలీసుశాఖను అప్రమత్తం చేసింది. ప్రధాన నగరాల్లో కాకుండా అంతగా ప్రాచుర్యం లేని ప్రాంతాల్లో ఈ ఉగ్రవాదుల కదలికలున్నట్లు అనుమానిస్తోంది. ముఖ్యంగా వారి గురి తెలంగాణ పోలీసులపై ఎక్కువ ఉండే అవకాశముందన్న అంశాన్ని కూడా హోంశాఖకు కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ చెప్పినట్టు సమాచారం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Intellegence  IB  police  terrorists  nalgonda  encounter  vikarudin  telangana  

Other Articles