ఎందెందు వెతికినా అందందే కలడు నా నారాయణుడు కలడు అని భక్త ప్రహ్లాదుడు పాడాడు. కానీ దాన్ని కొంత మంది తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ఎలా అంటారా.. ఎర్రచందనం దొంగలు ఎందెందు వెతికినా అందందు కలరు అని అంటున్నారు. శేషాచలం ఎన్ కౌంటర్ తర్వాత ఏపి ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లర్ల భరతం పడుతోంది. అసలు స్మగ్లింగ్ ఎక్కడ నుండి సాగుతోంది.. ఎవరెవరు ఉన్నారు అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. అయితే విచారణలో టాస్క్ ఫోర్స్ అధికారులకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. ఎర్రచందనం దుంగలను రకరకాల పేర్లతో పిలుస్తారని తేలింది. అలాగే వాటి సైజ్ కు తగ్గట్టుగా కూడా వాటికి పేర్లిస్తారట.
ఎర్ర చందనం దాచిన గోడౌన్ ను పోలీసులకు చూపించిన స్మగ్లర్ శరవణన్.. పోలీసులకు దిమ్మతిరిగిపోయే నిజాలు వెల్లడించాడు. అక్కడి గోడౌన్‌లో అత్యంత విలువైన ఏ-గ్రేడు ఎర్ర చందనం దుంగలు 11 టన్నుల వరకూ ఉన్నాయి. వాటిలో కొన్ని దుంగలు మీటరు కన్నా ఎక్కువ పొడవు ఉండగా.. మరికొన్ని అర మీటరులోపే లావుగా ఉన్నాయి. ఇంకొన్ని రకరకాల డిజైన్లలో ఉన్నాయి. దుంగలన్నీ రకరకాల సైజుల్లో ఉన్నాయి. ఏమిటని ఆరా తీయగా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. వాటిలో పొడవుగా ఉన్నవాటికి స్మగ్లర్లు సిగరెట్లు అని పేరు పెట్టారు. అర మీటరులోపు లావుగా ఉన్నవాటికి తబలా అని, వివిధ డిజైన్లలో ఉన్నవాటికి చాక్లెట్లు అని ముద్దు పేర్లు పెట్టారు. బర్మా, భూటాన్, చైనా తదితర దేశాల్లోని స్మగ్లర్లకు ఈ ముద్దు పేర్లతోనే సరుకు వివరాలు చెబుతారు. అక్కడ లాఫింగ్ బుద్ధ వంటి బొమ్మలు చేయడానికి చాక్లెట్లు, తబలాలను వినియోగిస్తారు. ఫర్నీచర్ తయారు చేయడానికి సిగరెట్లను ఎక్కువగా వినియోగిస్తారు. కొన్ని కొన్ని రకాల ఫర్నిచర్ తయారీకి చాక్లెట్లను కూడా వినియోగిస్తారు. ఆయా దేశాల్లో వాటికున్న డిమాండ్ ఆధారంగా అక్కడి స్మగ్లర్లు ఆర్డర్ ఇస్తారు. ఆయా ఆర్డర్ల ప్రకారం తమిళ స్మగ్లర్లు ఇక్కడి నుంచి వాటిని సిగరెట్, తబలా, చాక్లెట్ రూపాల్లో కత్తిరించి అక్రమంగా తరలిస్తారట.
పెద్దఎత్తున గ్రేడ్ 1 ఎర్ర చందనాన్ని అక్రమంగా నిల్వచేసిన గోడౌన్‌ను ఏపీ పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆ గోడౌన్ యజమాని తమిళనాడుకు చెందిన మాజీ ఎమ్మెల్యే అని తెలిసింది. తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రికి కీలక అనుచరుడైన ఈ మాజీ ఎమ్మెల్యే.. అక్కడెందుకు గోడౌన్ నిర్మించాడు? స్మగ్లింగ్‌లో అతనికీ భాగస్వామ్యం ఉందా.? అనే కోణంలో ఏపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని ఆధారాలతో వెళ్లి తమిళ పోలీసుల సాయంతో ఆయనకు సంకెళ్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా తమిళ సిని పరిశ్రమకు చెందిన ఓ నటుడిని కూడా పోలీసులు ఎర్రచందనం కేసులో అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో రోజు రోజుకు కొత్త విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. మరి కేసు పూర్తయ్యే సరికి ఎన్ని పెద్ద తలకాలయలు బయటపడతాయో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more