Baba Ramdev | Haryana | Cabinet | Minister

Baba ramdev reject the proposal of minister position from haryana govt

baba ramdev, haryana, cabinet, minister, position

Baba ramdev reject the proposal of minister position from haryana govt. Baba ramdev, who famous for yoga in the world reject the proposal.

రాందేవ్ బాబా దాన్ని వద్దన్నాడు

Posted: 04/21/2015 12:38 PM IST
Baba ramdev reject the proposal of minister position from haryana govt

బాబ రాందేవ్.. పేరు కాదు బ్రాండ్ అవును తెలుగు సినిమా హీరో డైలాగ్ లా ఉన్నా ఇది నిజం. యోగాతో కొట్ల మందికి చేరువైన బాబా రాందేవ్ కొత్త రికార్డులకు నిలయం. అయితే తాజాగా బాబా రాందేవ్ కు ఓ రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆఫర్ ఇచ్చింది కానీ దాన్ని అతను వద్దనుకున్నాడు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి అని అనుకుంటున్నారా.. బాబా రాందేవ్ కు మంత్రి హోదా కల్పిస్తామని హర్యానా ప్రభుత్వం ప్రకటించడమే.

హర్యానా రాష్ట్ర అంబాసిడర్‌గా కొనసాగుతున్న యోగా గురు రాందేవ్ బాబాకు మంత్రి హోదా కల్పిస్తామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్‌విజ్ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మంత్రి హోదాను రాందేవ్ బాబా తిరస్కరించారు. తనకు మంత్రి హోదా వద్దని స్పష్టం చేశారు. రాందేవ్ పర్యవేక్షణలో యోగా, ఆయుర్వేద విద్యను అభివృద్ధి చేయనున్నట్లు అనిల్‌విజ్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు పాఠ్యాంశాల్లో యోగాశాలలు నిర్మించనున్నట్లు విజ్ పేర్కొన్నారు. మొత్తానికి బాబాలు అంటే దేన్ని ఆశించరు అన్నట్లుగా రాందేవ్ బాబా వ్యవహరించారు. అందుకే బాబాకో.. జై  హో అంటున్నారు భక్తులు.

*అభిరనవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baba ramdev  haryana  cabinet  minister  position  

Other Articles