AkshayaTritiya | Gold | Silver | Purchase

On akshaya tritiya gold and silver purchase will be high

akshaya tritiya, gold, silver, hike, ladies, Increased demand ,gold,rate

On akshaya tritiya Gold and silver purchase will be high. People hope that on puchasing of gold or silver on akshaya tritiya will get luck to them.

కొనెయ్.. కొనెయ్.. అక్షయతృతీయ సందడి మొదలైంది

Posted: 04/21/2015 09:08 AM IST
On akshaya tritiya gold and silver purchase will be high

బంగారం, వెండి వంటి విలువైన లోహాల కొనుగోళ్లకు అత్యంత శుభప్రదమైన రోజుగా భావించే అక్షయ తృతీయ రానే వచ్చింది. మంగళవారం జరుపుకోనున్న ఈ పర్వదినాన ఆభరణ విక్రయాలు గతసారితో పోలిస్తే 25-30 శాతం పెరుగవచ్చని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేస్తున్నది. ఈమధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై ఆంక్షలను సడలించడంతో దేశీయంగా విక్రయాలు మళ్లీ సాధారణ స్థాయికి మెరుగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈసారి పసిడి కొనుగోళ్లు మరింత పుంజుకోనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

నిలకడగా ఉన్న గోల్డ్ రేట్లు ఈసారి పండుగ సేల్స్ పుంజుకునేందుకు దోహదపడనున్నాయని షాపుల యజమానులంటున్నారు. గతసారి అక్షయ తృతీయనాడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.30,000 స్థాయిలో ఉంది. ఈసారి రేటు రూ.27,000 స్థాయికి తగ్గింది. అంటే ఈ ఏడాది కాలంలో రేటు 10 శాతం మేర తగ్గిందన్నమాట. దీంతో ఈసారి అక్షయ తృతీయ వారికి సిరుల పంట పండిస్తుందని బులియన్ వర్గాలు ఆశగా ఉన్నారు. ఈసారి గొలుసులు, గాజులు, నాణేలు, ఉంగరాలు ఇంకా చిన్న సైజు ఆభరణాలు ఎక్కువగా అమ్ముడయ్యే అవకాశం ఉందని వారంటున్నారు. త్వరలో పెండ్లిండ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో పెళ్లికూతురు నగలకు కూడా గిరాకీ పెరుగవచ్చని, గత 10-15 రోజుల నుంచి పెండ్లి నగల కోసం బుకింగ్‌లు వస్తుండటమే ఇందుకు సంకేతమన్నారు. అయితే నేటి ఉదయం నుండి ఆడవాళ్ల హడావిడి మొదలైంది. ఉదయాన్నే షాపుల ముందు బంగారమో కుదరకపోతే వెండో కొనుగోలు చెయ్యాలని అప్పుడే క్యూ కూడా కడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం కాసులు ఉంటే మీరూ కనకాన్ని కొనుగోలు చెయ్యండి.

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akshaya tritiya  gold  silver  hike  ladies  

Other Articles