KishanReddy | Mission Kakatiya | Colour

Telangana bjp president kishan reddy oppose the telangana govt mission kakatiya colour

kishanreddy , kcr, trs, kakatiya mission, harish rao

Telangana BJP president kishan reddy oppose the telangana govt mission kakatiya colour. He said that kakatiya mission getting rose colour in every where. The telangana govt trying to give its party colour to kakatiya mission.

కలర్.. కలర్ కాకతీయ మిషన్ కలర్

Posted: 04/20/2015 08:50 AM IST
Telangana bjp president kishan reddy oppose the telangana govt mission kakatiya colour

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పై పలు ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. కాకతీయ విషన్ కాస్తా.. కమీషన్ కాకతీయగా మారిందని గతంలోనే విమర్శలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం కేవలం కొంత మంది అనుకూల నేతలకు కాంట్రాక్ట్ కేటాయించారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్, టిడిపి నేతలు మిషన్ కాకతీయపై మండిపడుతున్న ప్రభుత్వం మాత్రం వాటిని అస్సలు పట్టించుకోవడం లేదు. కాకతీయ మిషన్ లో భాగంగా పలు జిల్లాల్లో చెరువుల పునరుద్దరణ పనులను కూడా ప్రారంభిస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొ్త ఆలోచన రేకెత్తిస్తున్నాయి. కాకతీయ మిషన్ లో కమీషన్ గురించి కాకుండా కిషన్ రెడ్డి కలర్ గురించి గొంతెత్తుతున్నారు.

మిషన్ కాకతీయ పేరుతో చేపట్టిన చెరువుల పునరుద్ధరణకు తాము వ్యతిరేకం కాదని, ప్రభుత్వ సొమ్ముతో గులాబీమయం చేయడానికే వ్యతిరేకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిషన్ కాకతీయలో గడ్డపార, పార, తట్ట, కండువాలే కాకుండా చేతులు కడుక్కునే జగ్గు, చేతులు తుడుచుకునే రుమాలు కూడా గులాబీ రంగున్నవే వాడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యక్రమంలాగా మిషన్ కాకతీయ చేపడితే ప్రతిపక్ష పార్టీల నేతలు ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. పనులు పూర్తయ్యేదాకా ప్రతిపక్షాలను, నిపుణులైన రిటైర్డు ఇంజనీర్లను భాగస్వామ్యం చేస్తే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుందని కిషన్‌రెడ్డి సూ చించారు. రెండురోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించడం తప్ప ఆచరణాత్మక నిర్ణయాలేమీ తీసుకోలేదని విమర్శించారు. మొత్తాన్ని అన్ని పార్టీలు కమీషన్ ల గురించి మాట్లాడుతుంటే కిషన్ రెడ్డి మాత్రం కలర్ గురించి మాట్లాడారు. అయినా ప్రభుత్వం వారిదే అయినపుడు ఆ మాత్రం రంగు పడదా ఏంటని కొంత మంది తిరిగి కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారట.

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kishanreddy  kcr  trs  kakatiya mission  harish rao  

Other Articles