Venkiahnaidu | Centralgovt | Assurance | Crops | Farmers

Venkiah naidu clear that central govt will help the farmers who loss their crops in this season

Venkiah naidu, central, govt, modi, ap,telangana, season, rains,

Parliamentary affairs minister Venkiah naidu clear that central govt will help the farmers who loss their crops in this season. The farmers loss their crops by the unseason rians rom last one week. Central minister Venkaiah naidu gave assurance to farmers.

ఆదుకుంటాం.. ఆదుకుంటాం నాయనా.. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు

Posted: 04/16/2015 08:51 AM IST
Venkiah naidu clear that central govt will help the farmers who loss their crops in this season

అకాల వర్షాలతో నష్టపోయిన తెలుగు రాష్ట్రాల రైతులను నష్టపరిహారం చెల్లించి అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు భరోసా ఇచ్చారు. బుధవారం కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి మోహన్ కందారియా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ నాయకులు ఇంద్రసేనారెడ్డిలతో కలిసి నల్లగొండ జిల్లాలోని బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, భువనగిరి మండలాల్లో పర్యటించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు, తోటలను పరిశీలించారు. రామన్నపేట యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి బాధిత రైతుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. వెంకయ్య మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు కేంద్రం తరఫున రైతుల్లో భరోసా కల్పించేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చామన్నారు. తొలుత కరవు, తరువాత అకాల వర్షాలు రైతును తీవ్రంగా దెబ్బతీశామన్నారు. పరిశీలనల అనంతరం పంట నష్టాలపై కేంద్రానికి, ప్రధానికి నివేదిక అందిస్తామన్నారు.

కేంద్ర అధికారుల బృందం సైతం జిల్లాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. కేంద్రం ఇటీవలే పంట నష్టపరిహరం మొత్తాన్ని పెంచడంతోపాటు, ప్రకృతి వైపరిత్యాల్లో సంభవించిన నష్టాలకు పరిహారం చెల్లింపును పెంచిందన్నారు. గతంలో 50శాతం పంట దెబ్బతింటేనే పరిహారం చెల్లించే పరిస్థితి ఉండేదని, మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత 33శాతం పంట నష్టపోయినా పరిహారం చెల్లించేందుకు నిర్ణయించామన్నారు. మద్దతు ధర పెంపుపై ఆలోచన చేస్తున్నామని, అయితే కొనుగోలు ఎవరు చేయాలన్న సమస్య ఉందన్నారు. స్థానిక ధాన్యం స్థానిక అవసరాలకే వినియోగించాలన్న కేంద్రం ఆలోచనకు రాష్ట్రాలు సహకరించడం లేదన్నారు. పంటల బీమా పథకాన్ని కూడా సమర్ధవంతంగా అమలు చేసే విషయమై ఆలోచన చేస్తామన్నారు. ప్రస్తుతం బ్యాంకు రుణాలు పొందిన రైతులకు మాత్రమే బీమా పరిమితం అవుతుందన్నారు. పంట నష్ట పరిహారం, బీమా చెల్లింపులో కేంద్రంతోపాటు రాష్ట్రాలూ తమ వాటా అందించాలన్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేసేలా చూస్తామన్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkiah naidu  central  govt  modi  ap  telangana  season  rains  

Other Articles