Shoaib Malik on Sania Mirza Achievement | India Pakistan

Shoaib malik sania mirza achievement pride for india pakistan too

Shoaib Malik news, Shoaib Malik photos, Shoaib Malik twitter, Shoaib Malik press meet, Shoaib Malik comments, Shoaib Malik controversy, sania mirza controversy, sania mirza hot photos, sania mirza updates, sania mirza galleries, sania mirza photo shoot, sania mirza controversies, Shoaib Malik sania mirza

Shoaib Malik Sania Mirza Achievement Pride for India Pakistan too : Pakistan's ex-cricket captain Shoaib Malik said on Tuesday, he was proud his wife Sania Mirza had become the world's top-ranked doubles tennis player, adding it was an honour for both countries.

సానియా గెలుపు ఇండియాకే కాదు.. పాకిస్థాన్ కూ గర్వమే!

Posted: 04/15/2015 12:14 PM IST
Shoaib malik sania mirza achievement pride for india pakistan too

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డబుల్స్‌లో నంబర్ వన్ ర్యాంకు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే! మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో జత కట్టి మొన్న ఇండియన్ వెల్స్, నిన్న మియామీ ఓపెన్, ఇప్పుడు ఫ్యామిలీ సర్కిల్ కప్‌లనుసొంతం చేసుకున్న సానియా.. ఫ్యామిలీ సర్కిల్ కప్ సొంతం చేసుకుంది. ఈ ఘనత వహించిన తొలి భారత క్రీడాకారిణిగా సానియా చరిత్ర సృష్టించింది. ఈమె ఇలా మొదటి ర్యాంకును పొందడంపై ఆమెపై దేశం ప్రశంసలు వెల్లువ కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిందని ఆమెకు ప్రతిఒక్కరు ప్రశంస కిరిటంతో సన్మానం చేశారు.

ఇక తాజాగా ఈమె ఘనతపై ఆమె భర్త, మాజీ పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ స్పందించాడు. తన భార్య సాధించిన విజయాన్ని గర్వంగా భావిస్తున్నట్లు తెలిపాడు. అంతేకాదు.. ఆమె విజయం భారత్ తోపాటు పాకిస్థాన్ కు అత్యంత గౌరవప్రదమని పేర్కొన్నాడు. ‘సానియా విజయం పట్ల నేను చాలా గర్వంగానూ, సంతోషంగానూ వున్నాను. నా భార్యగా పాకిస్థాన్ కు చాలా గర్వకారణం. అంతేకాదు.. 100 శాతం నిబద్ధతతో తన దేశం తరఫున సానియా ప్రాతినిధ్యం వహిస్తోంది’ అని షోయబ్ అన్నాడు. అలాగే ఆమె విజయం యువ అభిమానులకు ప్రేరణ ఇస్తుందని, అది సానియా నిరూపించిందని అతడు పేర్కొన్నాడు.

సానియా గెలుపొందిన తర్వాత కుటుంబసభ్యులతో కలిసి సియోల్ కోటలో వేడుక జరుపుకున్నామని షోయబ్ వెల్లడించాడు. సానియాను పెళ్లి చేసుకోకముందు టెన్నిస్ అంటే ఎంతో ఇష్టమని తెలిపిన ఇతను.. ఇప్పుడు అదే తన హృదయమంతా నిండా వుందని చెప్పుకొచ్చాడు. ఇదిలావుండగా.. షోయబ్ చేసిన ఈ కామెంట్లపై భారతీయ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shoaib Malik  Sania Mirza  Pakistan  India  

Other Articles