Meteorological Department revealed Another two days Torrential rains will fall

Meteorological department revealed another two days torrential rains will fall

Meteorological Department, telugu states, Torrential rains, andhra pradesh state, telangana state, rains in hyderabad, telangana state rains, heavy falls rains

Meteorological Department revealed Another two days Torrential rains will fall : The Meteorological Department has revealed that Torrential rains will fall Another two days in telugu states.

నాన్నా ఇది ‘ట్రైలర్’ మాత్రమే.. ‘కుండపోత’ ముందుంది!

Posted: 04/14/2015 02:02 PM IST
Meteorological department revealed another two days torrential rains will fall

గత మూడురోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షం భీబత్సకరంగా కురుస్తున్న విషయం తెలిసిందే! పైగా వేసవికాలంలో ఈ రేంజులో వర్షాలు పడటం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అటు వాతావరణ శాఖ కూడా సుమారు 100 సంవత్సరాల తర్వాత చాలా చల్లని వేసవి తిరిగొచ్చిందని ఇదివరకే ప్రకటించేసింది కూడా! అంటే.. ఈ వేసవి మొత్తం ఎండతాపంతో కాకుండా మేఘాలు జాలువారి చల్లని వాతావరణాన్ని క్రియేట్ చేయనున్నాయని సమాచారం! ఏదైమైనా.. ఈ వేసవిలో వర్షాలు పడడాన్ని ప్రజలు ఆనందంగా ఆస్వాదిస్తున్నారు.

ఇదిలావుండగా.. ఇప్పటివరకు పడిన వర్షాలు కేవలం ట్రైలర్ మాత్రమేనని ఇకనుంచి మరో రెండురోజుల వరకు కుండపోతగా వాన కురవడం తప్పదని తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. భూ ఉపరితలానికి 1.5 కి.మీ. ఎత్తున ఉన్న ఉపరితల ద్రోణికి తోడు తేమ గాలులు, క్యుములో నింబర్ మేఘాల కలయిన కారణంగా కుండపోత వర్షాల ప్రమాదం పొంచి వుందని వారు పేర్కొంటున్నారు. అంతేకాదు.. వడగళ్లతో కూడిన వర్షాలే పడతాయని వారు తెలుపుతున్నారు. కాబట్టి.. వర్షాలు పడుతున్న సమయంలో జాగ్రత్త వహించాలని వారు సూచిస్తున్నారు.

రాయలసీమ, కోస్తాంద్ర, తెలంగాణ ప్రాంతాల్లోని పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు చాలా అప్రమత్తంగా వుండాలని ఈ శాఖ సూచించింది. కాగా.. గడిచిన 12 గంటల్లో హైదరాబాద్ నగరంలో 3 సెంటిమీటర్లు, తిరుపతిలో 2 సెంటిమీటర్ల వర్షం పడింది. ఇక మిగతా చోట్ల 6 మి.మీ. నుంచి 10 మి.మీ వర్షపాతం నమోదైంది. అయితే.. ఈసారి మరింత ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశ ముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Torrential rains  Meteorological Department  ap telangana telugu states  

Other Articles