California | Nude | Office | Staff

Corporate ofice staff attend office nudely

corporate, nude, meeting, california,

corporate ofice staff attend office nudely. In california a corporate office staff attend ofice and all meeting nudely. The boss of the corporate company shocked on staff decision.

హవ్వ.. ఆఫీసుకు నగ్నంగా వస్తారా.. ఛీ..పాడు

Posted: 04/14/2015 01:08 PM IST
Corporate ofice staff attend office nudely

ఫారెనర్స్ కు పైత్యం కాస్త పీక్ స్టేజ్ లో ఉంటుంది అని అందరికి తెలుసు. వాళ్లు ఏదైనా చెయ్యాలనుకుంటే అందరికంటే డిఫరెంట్ గా చెయ్యాలని అనుకుంటారు. ఏదైనా నిరసన తెలపాలనుకుంటే.. మనలాగా గొంతు చించుకొని.. ఎండలో నిలబడి నిరసన తెలపరు. ఏకంగా నగ్నంగా నిలబడి.. నినాదాలు చేస్తు నిరసన తెలుపుతారు. అలా వారు ఏం చేసినా రొటీన్ కు భిన్నంగా చేస్తుంటారు. అయితే తాజాగా ఓ ఘటన మాత్రం అంతటా చర్చకు దారి తీసింది. అసలు ఏం జరిగింది.. ఎక్కడ జరిగింటి ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

కార్పోరేట్‌ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాలంటే సూటు, బూటూ తప్పనిసరి. ఇందులో ఏది మిస్సైనా కంపెనీ ఒప్పుకోదు. క్రమశిక్షణా చర్యల కింద చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ రూల్స్‌ నచ్చని కాలిఫోర్నియాకు చెందిన ఓ కార్పోరేట్‌ ఉద్యోగులు కంపెనీపై కస్సుమన్నారు. రోజూ ఈ ఫార్మల్‌ డ్రస్సుల్లో రావాలంటే కష్టంగా ఉందని గొడవ పెట్టారు. దీంతో తిక్కరేగిన కంపెనీ అయితే మీ ఉద్దేశ్యం ఏమిటీ… బట్టలు లేకుండా ఆఫీసుకొస్తారా అని ఉద్యోగులను ప్రశ్నించింది. ఇదేదో బాగుందే అనుకున్న ఉద్యోగులు… వెంటనే ‘యస్‌’ అని నోళ్లే కాదు చేతులు ఎత్తారు.

రేపటి నుంచి ఎందుకు ఇవాళ్టి నుంచే డ్రస్‌ లేకుండా ఆఫీసుల్లో పనిచేస్తామని బాస్‌ ఎదురుగానే… తమ వంటిపై ఉన్న బట్టలన్నింటిని విప్పేసి ఎంచక్కా తమ సీట్లలో కూర్చొని పని ప్రారంభించారు. ఓ నెల రోజుల పాటు ఇలానే ఆఫీసుల్లో బట్టలు లేకుండా పనిచేస్తామని వాగ్దానం కూడా చేశారట ఉద్యోగులు. ఈ హఠాత్‌ పరిణామానికి ఖంగుతిన్న బాస్‌ తేరుకోవటానికి చాలా సమయమే పట్టిదంట. ఉద్యోగుల ఇష్టాన్ని కాదంటే అక్కడ కంపెనీలపై కఠినచర్యలు తప్పవు కాబట్టి… చేసేది లేక నగ్నంగా తిరిగే ఉద్యోగులను చూస్తూ రోజులు లెక్కేస్కోందట కంపెనీ బాస్. అలా కంపెనీలో పిచ్చి పీక్స్ వచ్చేసింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : corporate  nude  meeting  california  

Other Articles