Salfies | Museum | Manila

Slfie museum at philipins capital manila

Slefie, museum, philipins, manila, selfie capital of the world,

slfie musium at philipins capital manila Now also known as the "selfie capital of the world", the Philippines has an art museum that, instead of keeping you away from art pieces, encourages you take selfies with them and share your pictures with the world.

సై.. సై.. హై.. హై సెల్ఫీల మ్యూజియమోయ్

Posted: 04/14/2015 12:12 PM IST
Slfie museum at philipins capital manila

ఈ మధ్య సెల్ఫీల క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. ఈ ఆసక్తినే క్యాష్‌ చేసుకునేందుకు ఓ మ్యూజియం ఏర్పాటు కాబోతోంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇప్పుడు సెల్ఫీలకు అడ్డాగా మారిన ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫీల మ్యూజియం ఫోటో ప్రేమికులను, పర్యాటకులను ఆకర్షిస్తోంది. త్రీ డైమన్షనల్ పెయింటింగ్స్, శిల్పాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. రండి...ఇక్కడ కావాల్సినన్ని సెల్ఫీలు తీసుకో్ండి... మీ ఆనందాన్ని ప్రపంచంతో పంచుకోండి... పండగ చేసుకోండి... అంటూ ఆహ్వానిస్తున్నారు నిర్వాహకులు.

సాధారణంగా మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన వస్తువులను, పెయింటింగ్స్, బొమ్మలు ఏవైనా చేతితో తాకడానికి అవకాశం ఉండదు. అంతేకాదు ఫోటోలు తీసుకోవడానికి కూడా అనుమతి ఉండదు. కానీ మనీలాలో ఉన్న మ్యూజియంలో మాత్రం కావాల్సినన్నీ ఫోటోలు తీసుకోవచ్చు. ముట్టుకోవచ్చు. ఆడుకోవచ్చు, గెంతొచ్చు.. అంతెందుకు మీకు ఎలా కావాలంటే అలాఫోటోలకు ఫోజులివ్వొచ్చు. సెల్ఫీలు తీసుకోవచ్చు. ఎంజాయ్ చేయమని బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నారు నిర్వాహకులు.

మీరు లేకపోతే ఈ మ్యూజియం లేదు.. మీరు ఫోటోలు తీసుకోకపోతే ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ కు అర్థం లేదంటున్నారు మ్యూజియం కార్పొరేట్ సెక్రటరీ బ్లిత్ కాంబయా. ఇక్కడ మీ అనుభవాలను, మీరు తీసుకున్న ఫోటోలను ప్రపంచంలో ఉన్న ఎవ్వరితోనైనా పంచుకోవచ్చంటున్నారు. మిగతా మ్యూజియంలలో అయితే సీరియస్ గా ఉండాలి... కానీ ఇక్కడ మాత్రం సెల్ఫీలతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు అమెరికా పర్యాటకులు. ఈ అనుభవం కొత్తగా, అద్భుతంగా ఉందంటున్నారు. మరి మీరు కూడా ఇలాంటి అనుభవాన్ని పొందాలని అనుకుంటే పదండి మనీలా..

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Slefie  museum  philipins  manila  selfie capital of the world  

Other Articles