TRAI | One lakh | Requests

Trai got one lakh mails from netigens all over india

TRAI, The Telecom Regulatory Authority of India, net, india, internet, mails, one lakh, requests

The Telecom Regulatory Authority of India (Trai) has received as many as 1 lakh votes from netizens across India supporting net neutrality in the country. The online campaign stands against telecom operators charging extra money from users and companies to open apps faster, and slowing down the speeds for those who don't pay.

ట్రాయ్ కు లక్ష మెయిల్స్.. నెట్ పై నియంత్రణ వద్దంటూ వినతులు

Posted: 04/13/2015 04:57 PM IST
Trai got one lakh mails from netigens all over india

బాబ్బాబ్. ఆ పని మాత్రం చెయ్యకండి అంటూ ఓ ప్రభుత్వ సంస్థకు ఏకంగా లక్ష మెయిల్స్ వచ్చాయి. ఏంటీ.. లక్షా అనుకోకండి అది అక్షరాల నిజం. ఇంతకీ విషయం ఏంటంటే ఇంటర్నెట్ స్వేచ్ఛను హరించే ప్రయత్నం మానుకొని యధాతథ స్థితిని కొనసాగించాలని భారతీయ ఇంటర్నెట్ వినియోగదారులు కోరుతున్నారు. అందుకోసం టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)కు దాదాపు లక్ష మెయిల్స్ను savetheinternet.in. ద్వారా పంపించారు. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు మరికొందరు కలిసి భారీ స్థాయిలో ఈ విషయంలో స్పందించారు.

వాట్సాప్, ఫ్లిఫ్కార్ట్, స్కైప్వంటి కొన్ని ప్రత్యేక యాప్లు, వెబ్సైట్లను వాడే వ్యక్తుల నుంచి ప్రత్యేక చార్జీలు వసూలు చేయడమే కాకుండా, మరికొన్నింటిని నిషేధించాలని ట్రాయ్ నిబంధనలు తీసుకురావాలనుకుంటోంది. ఇందుకోసం వారం రోజుల్లోగా అభిప్రాయం తెలపాల్సిందిగా కోరింది. దీంతో ఇంటర్నెట్ వినియోగదారులు, డీలర్లు భారీగా స్పందించి అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని కోరారు.

*అన్ని వెబ్ సైట్ లను ప్రభుత్వం ఒకేలా ట్రీట్ చెయ్యనుంది. ఎక్స్ ట్రా స్పీడ్ కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.
*అన్ని సైట్లను, అన్ని వైబ్ సూట్లలోని కంటెంట్ ను యాసిస్ చెయ్యడానికి వీలుపడదు.
*ఇటంర్నెట్ ప్రొవైడర్ ఖచ్చితంగా తన యూజర్లు ఎంత డాటా వాడుతున్నారు. ఏ సైట్లకు వాడుతున్నారొ వివరాలు తెలపాల్సి ఉంటుంది.
*నెదర్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఇప్పటికే ఇలాంటి విధానం అమలులో ఉంది.
*వాట్సాప్, ఫేస్‌బుక్,ఫ్లిప్‌కార్ట్ వంటి సోషల్ మీడియా సైట్ల వాటి వల్ల సైబర్ నేరాలు పెరిగిపోవడంతో వీటికి అడ్డుకట్ట వేయాలని ట్రాయ్ అడుగులు వేసింది.
* ఈ సైట్లు వాడుతున్న వారి నుంచి ప్రత్యేక చార్జీలు వసూలు చేయ్యాలని ట్రాయ్ నిర్ణయించింది.
* అతిగా వాడుతున్న సోషల్ మీడియా సైట్లలో కొన్నింటిని నిషేధించాలని ట్రాయ్ యోచిస్తోంది.
* భారత్ లో కూడా నెట్ ను అదుపులో ఉంచాలని చూస్తున్న ప్రభుత్వం ఆ దిశగా పావులు కదుపుతోంది.
* ఇంటర్నెట్ ను రక్షించండి అంటూ నెటిజన్లు ట్రాయ్ కు ఏకంగా లక్ష మెయిల్స్ పంపడం వార్తలకెక్కింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : TRAI  The Telecom Regulatory Authority of India  net  india  internet  mails  one lakh  requests  

Other Articles