Subramanyaswamy | Raffel | Modi | Fighters

Subramanya swamy warn to pm narendramodi on raffel fighters deal

subramanyaswamy, Raffel, Fighters, france, congress, modi, buy, nda, Upa

subramanya swamy warn to pm narendramodi on raffel fighters deal. The Nda govt deal the raffel fighters last so subramanya swamy suggestand also warn to modi to dont buy raffel fighters.

మోదీజీ నా మాట వినండి.. అవి కొనకండి. బాగోవండీ

Posted: 04/11/2015 04:19 PM IST
Subramanya swamy warn to pm narendramodi on raffel fighters deal

సుబ్రహ్మణ్యస్వామి.. పేరు కాదు బ్రాండ్ ఎలాంటి బ్రాండ్ అనుకుంటున్నారా.. ఫైర్ బ్రాండ్ . యుపిఎ చేసిన అవినీతి గురించి కొర్టులకు వెళ్లి సోనియా గాంధీతో సహా అందరికి ముచ్చెమటలు పట్టించారు సుబ్రహ్మణ్యస్వామి. మన్మోహన్ సింగ్తో సహా బొగ్గు కుంభకోణంలో ఉన్న వారి పేర్లను కోర్టు ముందు ఉంచారు. ఓ రకంగా చెప్పాలంటే యుపిఎ ప్రభుత్వానికి పతనం అంచులకు తీసుకెళ్లింది ఈ స్వామియే. అందుకే ఆ సుబ్రహ్మణ్యస్వామి పేరు చెబితే చాలు కాంగ్రెస్ నాయకుల్లో ఇప్పటికీ వెన్నులో వనుకే. అయితే తాజాగా సుబ్రహ్మణ్యస్వామి మోదీ గారికి ఓ ఉచిత సలహా ఇస్తున్నారు.

రఫల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోదీ అహేతుకంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఫ్రాన్స్లో పర్యటిస్తున్న మోదీ.. 36 రఫల్ యుద్ధవిమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ రూపొందించే రఫల్ యుద్ధవిమానాలు అత్యంత పనికిమాలినవని, ప్రపంచంలోని మిగతా దేశాలేవీ ఆ విమానాలని కొనుగోలు చేసేందుకు ముందుకురాలేదని స్వామి చెప్పారు.

'రఫల్ ఫైటర్ల ఇంధన సామర్థ్యం చాలా తక్కువ. ఇక పనితీరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పైగా మొదట ఆ డీల్ కుదుర్చుకుంది గత యూపీయే ప్రభుత్వం! వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఆ యుద్ధవిమానాల్ని కొనొద్దని మోదీకి విన్నవిస్తున్నా' అని అన్నారు. ఒకవేళ ఈ విషయంలో ప్రభుత్వ మొండిగా వ్యవహరిస్తే కోర్టును ఆశ్రయిస్తానన్నారు. ఒప్పంద పత్రాలు పరిశీలించిన తర్వాత పిల్ వెయ్యడం గురించి ఆలోచిస్తానని అంటున్నారు. మొత్తానికి స్వామికి కోపం వచ్చినట్లుంది అందుకే మోదీ గారికి ముందు సలహా ఇస్తున్నారు. ఒకవేళ సలహా పాటించకపోతే కోర్టులో చూసుకుంటా అంటున్నారు సుబ్రహ్మణ్యస్వామి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : subramanyaswamy  Raffel  Fighters  france  congress  modi  buy  nda  Upa  

Other Articles