Amitabh Bachchan conferred Padma Vibhushan by President

Amitabh bachchan prince karim aga khan get padma vibhushan

Bollywood megastar Amitabh Bachchan, president conferred padma awards, President Pranab Mukherjee, Prince Karim Aga Khan, eminent personalities, Kottayan K Venugopal,D Veerendra Heggade, Assamese Filmmaker Jahnu Barua, computer scientist Vijay Bhatkar, Hockey player Saba Anjum, women cricketer Mithali Raj, economist Bibek Debroy, IT honcho T V Mohandas Pai, musician Ravindra Jain

Bollywood megastar Amitabh Bachchan and Prince Karim Aga Khan were among the eminent personalities awarded the Padma Vibhushan, country’s second highest civilian honour, by President Pranab Mukherjee here on Wedesday.

అమితాబ్, కోటాలకు పద్మ అవార్డులు.. ఐశ్వర్య దంపతులే ప్రత్యేక అకర్షణ

Posted: 04/08/2015 02:14 PM IST
Amitabh bachchan prince karim aga khan get padma vibhushan

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అవార్డుల జాబితాలో మరో అత్యున్నత పురస్కారం చేరింది. భారత పౌరులకు అందించే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ను ఇవాళ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అమితాబ్ బచ్చన్ కు ఆయనకు అందించారు.బుధవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ విభూషణ్ అవార్డుల అందజేత కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అమితాబ్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్ లోని మెజిస్టిక్ దర్బార్ హాలులో జరిగిన కార్యక్రమంలో  బహువిభాగాల్లో కోవిదులైన వారికి రెండో దశలో మరో 104 మంది పద్మ అవార్డులతో రాష్ట్రపతి సత్కరించారు.

వీరిలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తో పాటు ప్రిన్స్ కరీం అగా ఖాన్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కోట్టయాన్ కె. వేణుగోపాల్, కర్ణాటకలోని ప్రముఖ ధర్మస్థల ఆలయానికి చెందిన వీరేంద్ర హెగ్డేలకు పద్మ విభూషన్ సత్కారాలను అందించారు. వీరితో పాటు ప్రముఖ అస్సామీ ఫిల్మ్ మేకర్ జాను బార్వా, కంప్యూటర్ సైంటిస్ట్ విజయ్ బాస్కర్ సహా పలువురికి పద్మభూషన్, భారత హాకీ విభాగానికి చెందిన సబా అంజుమ్, మహిళా క్రికెట జట్టు కెప్టన్ మిథాలి రాజ్, ప్రముఖ అర్థికవేత్త దెబరాయయ్, తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు, ఐటీ దిగ్గజం టివి మోహన్ దాస్ పై, ప్రముఖ సంగీత విద్యాంసుడు రవీంద్ర జైన్ సహా పలువురికి పద్మశ్రీ అవార్డులతో రాష్ట్రపతి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో తెలుగువాడు, తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖ టాలీవుడ్ నటుడు కోటా శ్రీనివాసరావు పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కోటా శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడుతూ.. పద్మశ్రీ పురస్కారంలో కేంద్ర ప్రభుత్వం తనను గుర్తించి గౌరవించడం చాలా సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలో తన ఇన్నేళ్ల సినీ ప్రస్థానం సంతృప్తికరంగా ఉందని కోటా చెప్పారు.

ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. కాగా ఈ అవార్డుల కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ తరపున ఆయన తనయుడు అబిషేక్ బచ్చన్, కోడలు, ప్రముఖ సినీ నటి ఐశ్వర్య బచ్చన్, అమితాబ్ కూతురు శ్వేత నంద, వాళ్ల సంతానంతో హాజరై ప్రత్యేక అకర్షణగా నిలిచారు. తొమ్మిది మంది పద్మ విభూషణ్, 20 మందికి పద్మభూషన్, 75 మందికి పద్మశ్రీ అవార్డులు వరించాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood  Amitabh Bachchan  Padma Vibhushan awards  Indian cinema  Karim Aga Khan  

Other Articles