Vikaruddin Encounter Case | digvijay singh | gujarat fake encounter

Vikaruddin encounter case digvijay singh compares gujarat fake encounter

Vikaruddin Encounter, Vikaruddin Encounter case, Vikaruddin Encounter controversy, Vikaruddin Encounter updates, digvijay singh news, digvijay singh controversy, Vikaruddin Encounter latest updates, telangana police service, telangana government

Vikaruddin Encounter Case digvijay singh compares gujarat fake encounter : AICC leader digvijay singh compares vikaruddin encounter with gujarat fake encounter which creates sensation national wide.

గుజరాత్ ‘ఫేక్’ ఎన్ కౌంటర్ లాగే వికారుద్దీన్ ను మట్టుబెట్టారు!

Posted: 04/08/2015 12:38 PM IST
Vikaruddin encounter case digvijay singh compares gujarat fake encounter

మక్కామసీదు కేసులో నిందితులుగా వున్న వికారుద్దీన్ తోపాటు అతడి నలుగురు సహచరులను ఇటీవలే పోలీసులు ఎన్ కౌంటర్ లో హతమార్చిన విషయం తెలిసిందే! వరంగల్ జైలు నుంచి హైదరాబాద్ కోర్టుకు తరలిస్తున్న తరుణంలో.. ఆ తీవ్రవాదులు పోలీసులపై వెకిలి చేష్టలు, దురుసు మాటలతో కవ్వించారు. అనంతరం మూత్రం పోసుకునేందుకు నిందుతులు కోరగా.. మార్గమధ్యంలో వరంగల్ జిల్లా జనగామ వద్ద పోలీసులు వ్యాన్ ను నిలిపారు. ఇదే అదనుగా బావించిన నిందితులు.. జైలు వార్డెన్ నుంచి తుపాకీ లాక్కుని పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు అత్మరక్షణ కోసం కాల్పులు చేయగా.. వికారుద్దిన్, సులేమాన్ సహా ఐదుగురు ఐఎస్ఐ సభ్యులు మరణించారు. ఈ మేరకు జరిగిన సంఘటనను ఎస్కార్ట్ పోలీసులు ఇదివరకే వర్ణించారు.

అయితే.. ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మైనారిటీ వర్గాలు నిరసన వ్యక్తం చేశాయి. వికార్ ను ఉద్దేశపూర్వకంగానే పోలీసులు కాల్చి చంపారని ఆరోపించాయి. ఇక వికార్ తండ్రి కూడా ఈ ఘటనపై స్పందిస్తూ.. పోలీసులు కావాలనే తన కొడుకును హతమార్చారని పేర్కొన్నారు. మరోవైపు నిందితుల మృతదేహాలు వ్యాన్ లోనే వుండగా, వారి కూర్చున్న సీట్లకు - వారి చేతులకు బేడీలు వేసి వున్నాయి. ఈ క్రమంలోనే ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ఎన్ కౌంటరేనని కొందరు అనుమానిస్తున్నారు. ఇలా చాలామంది పలురకాలుగా ఈ ఎన్ కౌంటర్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ అధికార ప్రతినిధి దిగ్విజయ్ సింగ్ కూడా ఈ ఎన్ కౌంటర్ మీద విచారణ జరిపించాని డిమాండ్ చేశారు. గతంలో గుజరాత్ లో వెలుగుచూసిన నకిలీ ఎన్ కౌంటర్ తరహాలోనే వికారుద్దీన్ ఎన్ కౌంటర్ జరిగిందేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా.. లష్కర్-ఏ-తోయిబా గ్రూపుకు సంబంధించిన కొందరు తీవ్రవాదులు ముంబై నుంచి గుజరాత్ లోకి ఎంటరయ్యారని తెలిసిన నేపథ్యంలో అక్కడి పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. అయితే.. ఈ కేసు విచారణలో అందులో ఒకరు ఉగ్రవాది కాదని తేలింది. దాంతో అది ఫేక్ ఎన్ కౌంటర్ గా ముద్రించబడింది. ఆ తరహాలోనే పోలీసులు కట్టుకథలు అల్లేసి.. వికారుద్దీన్ కాల్చి చంపి, ఎన్ కౌంటర్ గా చెప్పుకుంటున్నారని డిగ్గీరాజా అనుమానం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vikaruddin Encounter  digvijay singh controversy  gujarat fake encounter  

Other Articles