Lady | Bouncers | Culture | Metros

Women bouncers will come soon in all over for security instead of male bouncers

mertos, lady bouncers, bouncers, culture, mumbai, pub, party

Women bouncers will come soon in all over for security instead of male bouncers.Women bouncers have not just broken the proverbial glass ceiling in the country but also rapidly grown in numbers as concerned parents, cautious event managers, and pub and restaurant owners all seek their services.

లేడీ బౌన్సర్లు వస్తున్నారు జాగ్రత్త.. లేదంటే దబిడిదిబిడే

Posted: 04/06/2015 04:09 PM IST
Women bouncers will come soon in all over for security instead of male bouncers

పెద్ద పార్టీలో ఎవరో న్యుసెన్స్ చేస్తారు మరి వారిని అడ్డుకేనేది ఎవరు... ఎంతో పేరున్న సెలబ్రెటీలు ఏదో ఫంక్షన్ కు హాజరైతే వారికి రక్షణ కల్పించేది ఎవరు... ఇంకెవరు భారీ ఆకారంలో ఉండే బౌన్సర్లే. అవును వారి ఆకృతిని చూస్తేనే ఎదుటి వారు గుండెలు అదిరిపడాలి. అలాంటి బౌన్సర్ లను తమకు సెక్యురిటీగా పెట్టకోవడం సెటబ్రెటీలకు మామూలే. అయితే తాజాగా బౌన్సర్లుగా తాము ముందుటామని అంటున్నారు మహిళా బౌన్సర్ లు. అన్నింటిలో మగ వారికి ఏ మాత్రం తీసిపోము అంటున్న మహిళా లోకం.. ఇఫ్పుడిక బౌన్సర్లుగా కూడా అదరగొడతామని అంటున్నారు. చేయి చూశావా ఎంత రఫ్ గా ఉంది తెలుగు సినిమాలో హీరో డైలాగ్.. కానీ ఇప్పుడు మహిళలు కూడా చేయి చూపిస్తూ.. రఫ్ అంటే ఏంటో చెప్పకనే చెబుతున్నారు. పంచ్ పడితే పదహారు పళ్లు రాలతాయనీ అంటున్నారు. మొత్తానికి ఇక మీదట మగ బౌన్సర్లకు పోటీగా మహిళా బౌన్సర్లు వస్తున్నారు.

ఏడాది క్రితం మెట్రోనగరాల్లో కొంతమంది పబ్, బార్ యజమానులు మహిళా బౌన్సర్ల కాన్సెప్ట్‌ను తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ముంబయి, దిల్లీ, బెంగుళూరు, చెన్నై, ఛండీఘర్ లాంటి నగరాల్లోని బార్లు, పబ్‌ల్లో మహిళా బౌన్సర్ల నియామకం జరుగుతోంది. గత ఏడాది ఈ నగరాల్లో పబ్, బార్ యజమానులు సుమారు 5,000మంది మహిళా బౌన్సర్లను రిక్రూట్ చేసుకున్నారు. ఆశ్చర్యకరమైనవిషయం ఏంటంటే పురుష బౌన్సర్లు కన్నా మహిళా బౌన్సర్లే ఎక్కువ సంపాదిస్తున్నారు. పురుష బౌన్సర్ల కు ఒక షిప్ట్‌కు 800 నుంచి 1200 వరకు చెల్లిస్తుంటే… మహిళా బౌన్సర్లకు 1500 నుంచి 2,000 వరకు చెల్లిస్తున్నారు. ఈ లేడీ బౌన్సర్స్‌లు మహిళలనే కాకుండా ఒక్కోసారి  విందుల్లో, వినోదాల్లో నానా రభస చేసే పురుషులను సైతం హ్యాండిల్ చేస్తున్నారట. రోజుకు ఏకంగా 2,000 వరకు లభిస్తుండటంతో మెట్రోనగరాల్లో బౌన్సర్ల గా చేయడానికి చాలా మంది మహిళలు ముందుకు వస్తున్నారు. దీంతో, పలుసంస్థలు బౌన్సర్లు కావాలనుకునే అమ్మాయిలకు కరాటే, కుంగ్‌ఫూ లాంటి యుద్ధ విద్యలతో పాటు వ్యాయామం లాంటి విషయాల్లో శిక్షణనిచ్చేందుకు ముందుకువస్తున్నాయి.

బౌన్సర్లు అంటే భారీ ఆకారాన్ని ఊహించుకునే వారికి కొంత జరుకు కలిగేలా కొత్తగా లేడీ బౌన్సర్లు రానున్నారు. తొంరలోనే తమ తడాఖా ఏంటో చూపించనున్నారు. సెలబ్రెటీలకు ఎప్పుడూ మగ బౌన్సర్లు రక్షా నిలవడం చూశాం.. కానీ ఇక మీదట లేడి బౌన్సర్లు రక్షణా నిలువనున్నారు. మొత్తానికి అందంలోనే కాదు ఎందులోనైనా తాము ముందుంటామని అంటున్నారు మహిళలు. మరి హైదరాబాద్ లాంటి నగరాల్లోనూ తొందరలోనే లేడీ బౌన్సర్లు దర్శనమివ్వనున్నారు. మరి ఎక్స్ ట్రాలు చేసే వారూ వీరితో కాస్త జాగ్రత్తగా ఉండండి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mertos  lady bouncers  bouncers  culture  mumbai  pub  party  

Other Articles