Ordinence | Nda | President

Nda govt brought ordinence insted of land bill one more time

landpooling, oridence, nda, president, pranabmukharji, modi, opposition, rajyasabha

nda govt brought ordinence insted of land bill one more time. the modi govt one more time propose the ordinence on land pooling, the president pranabhmukharjee passed the ordinence.

మరోసారి దొడ్డిదారిలోకి ఎన్డీయే.. భూసేకరణకై రెండో సారి ఆర్డినెన్స్

Posted: 04/04/2015 09:03 AM IST
Nda govt brought ordinence insted of land bill one more time

భూసేకరణ చట్టాన్ని తీసుకురావడంలో ఎన్డీయే ప్రభుత్వం విఫలమవుతోంది. దాంతో చేసేదేమి లేక మరోసారి ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. దానికిగాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందుకు పంపగా ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. గత సంవత్సరం డిసెంబర్‌లో జారీ చేసిన వివాదాస్పద భూసేకరణ ఆర్డినెన్స్‌కు ఈనెల 5 వ తేదీన గడువు ముగియనుంది. ఆర్డినెన్సు స్థానంలో తీసుకు వచ్చిన భూసేకరణ చట్టసవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందక పోవడంతో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి వర్గ సమావేశం మరో ఆర్డినెన్సు తీసుకు రావాలని నిర్ణయించింది. కొత్త ఆర్డినెన్సు జారీ చేయాలని కేంద్రం రాష్ట్రపతికి సిఫారసు చేసింది. ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉన్న లోక్‌సభలో భూసేకరణ బిల్లు ఆమోదం పొందినప్పటికీ ప్రతిపక్షాల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న రాజ్యసభలో మాత్రం ఆమోదం లభించలేదు.

భూ సేకరణ బిల్లుకు మద్దతు కూడ గట్టాలని బిజెపి చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీని కోసం 35 మంది మంత్రులను, 100 ఎంపీలను రంగంలోకి దింపినా ప్రయోజనం లేకపోయింది. ఆర్డినెన్సుకు ఆరు నెలల లోపు ఉభయ సభల ఆమోదం లభించనట్లయితే అది చెల్లుబాటు కాదు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల మొదటి విడత ముగిసి రాజ్యసభ వాయిదా పడడంతో బిల్లుకు 5 వ తేదీ లోపు ఆమోదం లభించే అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో కేంద్రానికి కొత్త ఆర్డినెన్సు జారీ చేయక తప్ప లేదు. మొత్తానికి భూసేకరణ చట్టాన్ని తీసుకురావడంలో విఫలమైన ఎన్డీయే ప్రభుత్వం ఇలా ఆర్డినెన్స్ లతో ముందుకు సాగుతోంది. అయితే గతంలో యుపిఎ కూడా ఇదే ధోరణి అవలంబించింది. ప్రభుత్వం తాను అనుకున్న చట్టాలను చెయ్యలేని సందర్భాల్లో ఇలా ఆర్డినెన్స్ లు చేసి చట్టాలను పరోక్షంగా అమలు జరిగేలా చేస్తాయి. అయితే ఎన్డీయే ప్రభుత్వం దొడ్డి దారిన ఆర్డినెన్స్ ల జారీ ద్వారా వెళుతోందని కాంగ్రెస్, ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : landpooling  oridence  nda  president  pranabmukharji  modi  opposition  rajyasabha  

Other Articles