hyderabad scientists research on aids prevention in final stage

Hyderabad scientists research on aids prevention in final stage

hyderabad scientists, aids prevention, hyderabad scientists aids prevention, hyderabad scientists mayinkar praveen kumar, homeo doctor praveen kumar, indian institute of technology, iicd scientist mayinkar

hyderabad scientists research on aids prevention in final stage : The Hyderabad City Scientists mayinkar and praveen kumar saying that they are in almost final stage in aids prevention research.

హైదరాబాదీల ఘనత.. పాము విషంతో ఎయిడ్స్ కు మందు!

Posted: 04/03/2015 11:09 AM IST
Hyderabad scientists research on aids prevention in final stage

ఎయిడ్స్.. ఈ వ్యాధి నివారణకోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిపొందిన శాస్త్రవేత్తలు ఇంతవరకూ ఎన్నో ప్రయత్నాలు చేశారు, చేస్తూనే వున్నారు. కానీ ఇప్పటికీ అందులో సఫలీకృతం కాలేకపోయారు. అయితే.. సాంకేతికపరంగా ముందంజలో వున్న ప్రపంచదేశాలకు ధీటుగా మన హైదరాబాదీలు.. ఈ వ్యాధి నివారణ కోసం జరుపుతున్న పరిశోధనల్లో భాగంగా దాదాపు చివరి దశకు చేరుకున్నారు.

హైదరాబాద్ నగరంలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీడీ), ప్రభుత్వ హోమియో వైద్యకళాశాల నిపుణులు సంయుక్తంగా కలిసి ఎయిడ్స్ వ్యాధి నివారణ మందును తయారుచేస్తున్నారు. గతకొన్నాళ్ల నుంచి ఈ ఔషధంపై జరుగుతున్న పరిశోధనలు.. ప్రస్తుతం కీలకదశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అత్యంత విషపూరితమైన సర్పంగా పేరుగాంచిన రక్తపింజర (క్రొటాలస్ హెరిడస్) విషం నుంచి ఈ మందును తయారుచేస్తున్నట్లు ఐఐసీడీ శాస్త్రవేత్త మెయింకర్, హోమియో వైద్యనిపుణుడు ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

రక్తపింజర విషం ఆర్టీ అనే ఎంజైమ్ ను నిరోధించగలదని ఇప్పటికే ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా నిరూపించారు కూడా! అలాగే ఈ విషానికి హైచ్ఐవీ కణాల విభజనను అడ్డుకునే శక్తి వున్నట్లు వారు చెబుతున్నారు. ప్రస్తుతం తమ పరిశోధనలు కీలకదశలో వున్నాయని, త్వరలోనే ఈ నివారణ మందును అందుబాటులోకి తీసుకువస్తామని శాస్త్రవేత్తలు ధీమాగా చెబుతున్నారు. ఇదే నిజమైతే.. ఈ ఘనత సాధించినవారిగా హైదరాబాదీలు చరిత్రలోకెక్కుతారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles