lady oriented party | Invitation | Men

Lady oriented partys inviting men in to their partys

party, ladys, men, invitation, india, narishakti, women front,

The party’s participation in these elections was also special because it had fielded two male candidates, beside four female candidates. “We are not against men,” Kant had said. “We need men to work with us and we need their support.” However, it was predetermined that men will not be part of the national committee and will only be members of state chapters, while only a woman can head the party.”

రండి బాబూ రండి.. మహిళా పార్టీలోకి మగవాళ్లకు ఆహ్వానం

Posted: 04/02/2015 04:32 PM IST
Lady oriented partys inviting men in to their partys

భారతదేశం అంటే స్వేచ్ఛ ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే ఎవరైనా రాజకీయ పార్టీని పెట్టవచ్చు.. ప్రచారం కూడా చెయ్యవచ్చు. పార్టీ పెట్టిన వారి అదృష్టం బాగుంటే గెలుస్తారు.. ప్రజల అదృష్టం బాగుంటే ఓడిపోతారు. అయితే పార్టీలు పెట్టడానికి కులం, ప్రాంతం, ఇలా సవాలక్ష కారణాలుంటాయి. అందుకే పాపం ఆడవాళ్లకు న్యాయం జరగడం లేదని ఆ మధ్య కేవలం ఆడవాళ్ల కోసమే   కొన్ని పార్టీలు పుట్టుకొచ్చాయి. అయితేఅలా వచ్చిన రాజకీయ పార్టీలు నేడు 14 ఉన్నాయి.  అయితే వీటిలో పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలు కేవలం ఐదు మాత్రమే.

అయితే ఈ పార్టీలు కేవలం మహిళలకు సంబంధించినవని ముద్ర పడడంతో మగవాళ్లు తమ పార్టీల్లో చేరడం లేదని దాదాపు అన్ని విమెన్ ఓరియెంటెడ్ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. తాము ఎంతమాత్రం మగవాళ్లకు వ్యతిరేకం కాదని, తమ పార్టీల్లో చేరాల్సిందిగా మగవారిని కూడా ఆహ్వానిస్తున్నామని ఆ పార్టీలు తెలియజేస్తున్నాయి. అయితే పార్టీల ఉన్నత పదవులు మాత్రం మహిళలకే ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ఆల్ ఇండియా మహిళా దళ్, మహిళా అధికార్ పార్టీ, మహిళా స్వాభిమాన్ పార్టీ, యునెటైడ్ విమెన్ ఫ్రంట్, నారీ శక్తి పార్టీ, జగన్మయ్ నారీ సంఘటన్ తదితర విమెన్ ఓరియెంటెడ్ పార్టీలు ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, లక్నో నగరాల నుంచి రాజకీయ పార్టీలుగా రిజిస్టర్ చేయించుకున్నాయి. ఈ పార్టీల ఎజెండాలు వేరైనా దృక్పథం ఒకటే. అదే రాజకీయ రంగంలో మహిళలు రాణించడం. మొత్తానికి ఆడవారి కోసమే ఏర్పాటైన పార్టీలు ఇలా మగవారిని కూడా ఆహ్వానం లభిస్తుండటం విశేషం. అయితే అసలే ఉధార పురుషులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరి ఈ పార్టీల్లోకి ఎంత మంది చేరుతారో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : party  ladys  men  invitation  india  narishakti  women front  

Other Articles