Naralokesh | Tour | jagan

Nara lokesh commence to yathra in telugu states soon

nara lokesh, jagan, tour, tdp, chandrababu, telangana, ap

nara lokesh commence to yathra in telugu states soon. tdp president nara chandrababu son nara lokesh will soon tour in ap and telangana.

జగన్ vs నారా లోకేష్.. యాత్రలతో దండయాత్రకు సిద్దం..!

Posted: 04/01/2015 01:50 PM IST
Nara lokesh commence to yathra in telugu states soon

ఓదార్పు యాత్ర అనగానే అందరికి గుర్తుకు వచ్చే పేరు వైయస్ జగన్. తన తండ్రి మరణంతో కలత చెంది మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి జగన్ చేసిన, చేస్తున్న పర్యటన గురించి అందరికి తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేని చాలా మంది అబిమానులు మృత్యువాత పడ్డారు. అయితే అలా మరణించిన వారి కుటంబాలను ఓదార్పు యాత్ర పేరుతో ఓదారుస్తున్నారు జగన్. అయితే జగన్ కు పోటీ ఇస్తానంటున్నాడు టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్. జగన్ యాత్రకు ధీటుగా లొకేష్ యాత్ర సాగనుంది. అసలు లోకేష్ ఎందుకు యాత్రకు పూనుకున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

రోడ్డు ప్రమాదాల్లో మరణించిన టిడిపి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు లోకేష్. ఈ నెల 12 నుండి ఏపిలో ప్రారంభం కానున్న పరామర్శ యాత్ర ప్రారంభించి మొత్తం 50 మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. బాధిత కుటుంబాలకు రెండు లక్షల మేర ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. తెలంగాణలో కూడా లోకేష్ పర్యటన సాగనుంది కాగా ప్రస్తుతానికి పర్యటన తేదీ ఇంకా ఖరారు కాలేదు. అయితే జగన్ కు ధీటుగా లోకేష్ యాత్ర మరి సక్సెస్ అవుతుందా మీడియాలోనూ లోకేష్ కు తగిన ప్రచారం లభిస్తుందో లేదో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara lokesh  jagan  tour  tdp  chandrababu  telangana  ap  

Other Articles