Insurance | Tsunami | Supremecourt

Insurance company be made liable to pay damages caused by tsunami

Can an insurance company be made liable to pay damages caused by tsunami? The Supreme Court has agreed to settle the law on the issue.a plea filed by a port company seeking insurance claim for the damages caused to its insured property in December 2014 calamity and issued notice to United India Insurance Company.

an insurance company be made liable to pay damages caused by tsunami

అచ్చం సినిమా సీన్.. సునామీ పై ఇన్సూరెన్స్ వర్తిస్తుందా..?

Posted: 04/01/2015 10:44 AM IST
Insurance company be made liable to pay damages caused by tsunami

తెలుగులో గోపాల గోపాల సినిమా లో వెంకటేష్ దుకాణం భూకంపంలో కూలిపోతుంది. కానీ షాప్ కు ఇన్సూరెన్స్ ఉంటుంది. అయితే భూకంపం వల్ల కూలిపోతే అది ఇన్సూరెన్స్ కు అర్హత కాదని తరువాత తెలుస్తుంది. దాంతో వెంకటేష్ కోర్టుకు వెళ్లి అక్కడ చివరకు విజయాన్ని సాధిస్తాడు. సినిమాలో అయితే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయా అంటే అవుననే చెప్పొచ్చు. అచ్చంగా తెలుగు సినిమాలో లాగానే ఇన్సూరెన్స్ చేయించుకున్న వ్యక్తికి చెల్లదని కంపెనీ చేతులెత్తింది. అయితే సునామీ వల్ల నష్టపోయిన తమకు  ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించాలని క్రిష్ణపట్నం పోర్టు కోర్టును ఆశ్రయించింది. మరి కోర్టు తీర్పు ఎలా ఉంటుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

క్రిష్ణపట్నం పోర్ట్ ప్రమాదాలు జరుగుతాయని ముందు జాగ్రత్తగా 15 కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ చేయించింది. అయితే 2014లో వచ్చిన సునామీ కారణంగా పోర్టుకు తీవ్ర నష్టం వచ్చింది. అయితే అంతకు ముందే ఇన్సూరెన్స్ ఉంది కనుక కంపెనీకి విషయాన్ని అందించింది. అయితే సమాచారం అందుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ అన్ని వివరాలను సేకరించి చివరకు ఇన్సూరెన్స్ చెల్లించడం లేదంటూ చేతులెత్తింది. ఇంతకీ ఎందుకు చెల్లించడానికి ముందుకు రావడం లేదని ప్రశ్నిస్తే.. ఇన్సూరెన్స్ పాలసీలో భూకంపం వస్తే పాలసీ వర్తిస్తుందని కానీ సునామీ పాలసీ పరిధిలో లేదని కంపెనీ అంటోంది. దాంతో ఖంగుతిన్న క్రిష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఇన్సూరెన్స్ కంపెనీపై కోర్టులో పోరాడాలని నిర్ణయించుకుంది.

ఎంతకీ ఇన్సూరెన్స్ కంపెనీ ముందుకు రాకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లింది క్రిష్ణపట్నం పోర్ట్ యాజమాన్యం. అసలు సునామీకి కారణం సముద్రంలో వచ్చే భూకంపమే కనుక తమకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని, సదరు ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ డబ్బులను చెల్లించాలని కోరింది. అయితే పోర్టు వాదనలో నిజముంది. శాస్ర్తవేత్తలు కూడా సునామీకి కారణం భూకంపమే అని నిర్దారించారు. కాగా కేవలం భూకంపం వల్ల కలిగే నష్టానికి మాత్రమే పాలసీ వర్తిస్తుందని ఇన్సూరెన్స్ కంపెనీ వాదిస్తోంది. మరి సుప్రీంకోర్టు రెండు పక్షాల వాదనను విన్న తరువాత ఎలాంటి తీర్పును వెలువడిస్తుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : company  insurance  supremecourt  port  tsunami  delhi  

Other Articles