Maa Elections Results | Hyderabad city civil court | Maa controversy

Maa elections resultls posponed by hyderabad city civil court

maa election results, maa elections, maa elections news, maa elections polling, celebrities at maa elections, murali mohan news, rajendra prasad news, jayasudha news, telugu actress hema news, hyderabad city civil court, maa polling controversy

maa elections resultls posponed by hyderabad city civil court : Hyderabad city civil court postponed maa elections results for not submitting polling video to court in time.

‘మా’ ఎన్నికల ఫలితాలపై ఝలకిచ్చిన కోర్టు

Posted: 03/31/2015 12:23 PM IST
Maa elections resultls posponed by hyderabad city civil court

‘మా’ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మార్చి 29 (ఆదివారం)న ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే! ఈ ఎన్నికల్లో భాగంగా మొత్తం ఓట్లు 702 కాగా.. కేవలం 394 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో అధ్యక్ష పదవికోసం రాజేంద్రప్రసాద్, జయసుధ బరిలో నిలిచిన విషయం విధితమే! ఈ ఎన్నికలు ముగిసిన అనంతరం వీరిద్దరి భవితవ్యం రెండుమూడు రోజుల్లోనే తేలనుందని అంతా అనుకున్నారు. ఇండస్ట్రీలోనే సరికొత్త నాంది పలికిన ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారోనని టాలీవుడ్ ప్రేక్షకులతోపాటు సినీ ప్రముఖులు సైతం ఎంతో ఆసక్తిగా వున్నారు. అయితే.. సిటీ సివిల్ కోర్టు ఈ ఎలెక్షన్ ఫలితాలపై అందరికీ షాక్ తగిలేలా తాజాగా తీర్పును వెల్లడించింది.

‘మా’ ఎన్నికలు జరగడానికి ముందు ఈ ఎలెక్షన్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని నటుడు ఓ.కల్యాణ్ సిటీ సివిల్ కోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే! దీంతో ఈ ఎన్నికల ఫలితాలు కోర్టు తీర్పు అనంతరమే తేలాల్సి వుండేది. ఎన్నికలు ఏ విధంగా జరగాయోనన్న విషయంపై సమగ్ర విచారణ జరిపిన మేరకే తీర్పు వెల్లడించాలన్న సూచనను కోర్టు ఇచ్చింది. ఆ మేరకే ఎన్నికల పోలింగ్ వీడియో క్యాసెట్లను పోలింగ్ అధికారులు కోర్టుకు సమర్పించాలి. కానీ.. అధికారులు ఇంతవరకు ఆ వీడియో క్యాసెట్లను సమర్పించకపోవడంతో ‘మా’ ఎన్నికల ఫలితాలపై విచారణను కోర్టు ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.

నిజానికి మంగళవారమే (31-03-2015) ‘మా’ ఎన్నికల ఫలితాలను కోర్టు ప్రకటించే అవకాశం ఉందని ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన పోలింగ్‌కు సంబంధించి క్యాసెట్లను అధికారులు కోర్టుకు సకాలంలో సమర్పించలేకపోయారు. దీంతో మరో వారంవరకు ఈ ఎన్నికల్లో ఎవరు గెలుపొందాన్న విషయం సస్పెన్స్ గానే కొనసాగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maa elections results  hyderabad city civil court  rajendra prasad  jayasudha  

Other Articles