padma awards function | pranab mukherjee | rashtrapathi bhavan

Padma awards function held in rashtrapathi bhavan in new delhi

padma awards, padma awards function, rashtrapathi bhavan, pranab mukherjee news, amitabh bachan, pv sindhu news, bharatratna awards, pandit madan mohan malavya bharatratna, padma vibhushan award

padma awards function held in rashtrapathi bhavan in new delhi : President Pranab Mukherjee handed over padma awards who were named in this list in rashtrapathi bhavan New Delhi On Monday.

‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవంలో మాలవ్యకు ‘భారతరత్న’

Posted: 03/30/2015 01:47 PM IST
Padma awards function held in rashtrapathi bhavan in new delhi

ఇటీవలే కేంద్రప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాల జాబితాను వెల్లడించిన విషయం తెలిసిందే! వివిధ రంగాల్లో కృషిచేసిన వారికి ఈ పద్మ పురస్కారాలు అందజేయనున్నట్లుగా ప్రభుత్వం ఇటీవలే తెలిపింది. ఇప్పుడు ఈ అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లోని అశోకా హాల్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది.

ఈ పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా ప్రజాక్షేత్రంలో అత్యున్నత సేవలందించినందుకు బీజేపీ అగ్రనేత ఎల్.కే.అద్వానీ, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, న్యాయవాది హరీష్ సాల్వేలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ‘పద్మవిభూషణ్’ పురస్కారాన్ని స్వీకరించారు. అలాగే క్రీడవిభాగంలో అద్భుతంగా రాణించిన పివి సింధు, కళారంగం నుంచి నటుడు కోట శ్రీనివాసరావు, వైద్య రంగంలో డా.అనగాని మంజుల, మిథాలీరాజ్, నోరి దత్తాత్రేయుడు, రఘురామ్ తదితర తెలుగువారు రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ అందుకున్నారు. మొత్తంగా చెప్పాలంటే.. 9 మందికి పద్మవిభూషణ్, 20 మందికి పద్మభూషణ్, 75 మందికి పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి భవన్ లో ప్రదానం చేశారు.

ఇదిలావుండగా.. ప్రముఖ విద్యావేత్త, స్వాతంత్ర సమరయోధుడు పండిట్ మదన్‌మోహన్‌ మాలవ్య (మరణానంతరం)కు ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన భారతరత్న పురస్కారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బహుకరించారు. మాలవ్య తరపున ఆయన మనవరాలు హేమ్‌ శర్మ, మనవడి భార్య సరస్వతీ మాలవ్య, మనవలు ప్రేమ్‌ధర్‌ మాలవ్య, గిరిధర్‌ మాలవ్య బహుమానాన్ని అందుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : padma awards function  pranab mukherjee  rashtrapathi bhavan  

Other Articles