kalyan | Muralimohan | Maa

Kalyan fire on maa farmer president muralimohan maa elections

kalyan, muralimohan, maa, movie artist association, elections, media, tepmle, ccl, dairy

kalyan fire on maa farmer president muralimohan. maa elections going to be intresting. kalyan fire on murali mohan . murali mohan decisions making loose to maa.

మురళీ మోహన్ నిర్ణయాలతొ 'మా' కు నష్టం

Posted: 03/28/2015 05:28 PM IST
Kalyan fire on maa farmer president muralimohan maa elections

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరింత వేడెక్కుతున్నాయి. గతంలో మా ప్రెసిడెంట్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన మురళీమోహన్ పై పలు రకాల ఆరోపణలు ఉన్నాయి. మురళీమోహన్ ఆధ్వర్యంలో ఎన్నో అవకతవకలు ఉన్నాయంటూ ఓ కల్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. ఆర్థికపరమైన అవకతవకలపై అసోసియేషన్కు ఎన్నో ఉత్తరాలు రాశానని, ఒక్క ఉత్తరానికీ  మురళీ మోహన్ నుండి సమాధానం రాలేదని కల్యాణ్ తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే మీ ముందుకు వచ్చానని.. రాజకీయ పార్టీల్లో కూడా ఇంత వ్యతిరేకత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  

అసలు మా లో ఎప్పుడూ లేనంతగా ప్రత్యేకంగా ఎలక్షన్స్ ఉన్నాయంటూ నోటీసుబోర్డులో పెట్టారని ఆరోపించారు. 'మా' డబ్బును మురళీ మోహన్ 5 లక్షలు దేవాలయాలకు ఇచ్చారు. ఇలా సినీ కార్మికుల డబ్బులను తన ఇష్టానుసారంగా వాడుకున్నారని ఆరోపణ ఉంది. అయితే కళ్యాణ్ తాను కూడా గుడి కట్టిస్తానని, మరి తనకూ అలాగే డబ్బులు ఇస్తారా ? అని ప్రశ్నించారు. 'మా' డబ్బును మురళీమోహన్ వేరే వాళ్లకు ఎందుకు ఇస్తారు.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఎల్ క్రికెట్ వెనుక మురళీమోహన్ ఉన్నారు. సిసిఎల్ రెండు కోట్లు రూపాయలు వసూలయ్యాయి. అయితే అందులోంచి కనీసం ఒక్క పేద ఆర్టిస్టునైనా ఆదుకున్నారా.  మూ వీ ఆర్టిస్ట్ డైరీ పేరుతో ఐదు లక్షలు ఖర్చు చేశారు. తరువాత మోహన్ బాబు దీనిపై ప్రశ్నిస్తే అప్పుడు తిరిగి చెల్లించారు.  మా కు ఓ కంపెనీ  డబ్బులు బాకీ ఉన్నా, వసూలు చెయ్యడంలో ఎందుకు నిర్లక్షంగా వ్యవహరించారు. అడిగితే మురళీ మోహన్ గారు మా నష్టాల్లో ఉందని అన్నారు. కానీ తీరా చూస్తే ప్రాఫిట్ లో ఉంది. కానీ అది వాస్తవం కాదు చెమట ఓర్చి క్రికెట్ ఆడి డబ్బులు సంపాదిస్తుంటే ఆయన మాత్రం నీళ్లలా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. అయితే మా డైరీ పై మురళీ మోహన్ కు సంబందించిన వ్యక్తి ఫోటోలు ప్రచురించారు. మా డబ్బులను గుడికి ఇస్తున్నానని కనీసం చెప్పలేదు. కనీసం ప్యానెల్ లో చర్చించలేదు కూడా. అంతగా ఇవ్వాలనుకుంటే మీ పాకెట్ లో ఇవ్వండి అంటూ కళ్యాణ్ మండిపడ్డారు. మురళీ మోహన్ తీసుకుంటున్న  స్వంత నిర్ణయాలతొ మా కు నష్టం కలుగుతొందని అన్నారు.

Video Courtesy : sakshi

హైలెట్స్ ..

మురళీ మోహన్ తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకపక్షమే
అసలు మా ఎన్నికలు ఇలా జరుగున్నందుకు సిగ్గు పడుతున్నాను
ఒకరిని ఒకరు తిట్టుకోవడం మామూలైపోయింది
ఇది అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషనేనా అనే అనుమానం కలుగుతోంది.
మూ వీ ఆర్టిస్ట్ బైరీ పేరుతో ఐదు లక్షలు ఖర్చు చేశారు
మా నష్టాల్లో ఉందని అన్నారు. కానీ తీరా చూస్తే ప్రాఫిట్ లో ఉంది
ఆర్టిస్టులు క్రికెట్ ఆడి డబ్బులు సంపాదిస్తుంటే ఆయన మాత్రం నీళ్లలా ఖర్చు చేస్తున్నారు
మా డైరీ పై మురళీ మోహన్ కు సంబందించిన వ్యక్తి ఫోటోలు ప్రచురించారు
మా డబ్బులను గుడికి ఇస్తున్నానని కనీసం చెప్పలేదు.
మురళీ మోహన్ తీసుకుంటున్న  స్వంత నిర్ణయాలతొ మా కు నష్టం.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kalyan  muralimohan  maa  movie artist association  elections  media  tepmle  ccl  dairy  

Other Articles