Sri Rama Navami Shobha Yatra starts in Hyderabad

Sri rama navami shobha yatra starts in hyderabad

Sri Rama Navami Shobha Yatra, Sri Rama Navami, Sri Rama Navami Shobha Yatra starts in Hyderabad, Shobha Yatra starts in old city, Sri Rama Navami Shobha Yatra starts in old city, Sri Ramanavami, old city, city police, seetarambagh, Hyderabad, Srirama Navami traffic restrictions,

In view of the Sri Ram Navami Shobha Yatra, traffic restrictions will be imposed in Goshamahal and Sultan Bazar areas on Saturday

రామ నామస్మరణతో కదిలిన శోభాయాత్ర..

Posted: 03/28/2015 02:12 PM IST
Sri rama navami shobha yatra starts in hyderabad

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ పాతబస్తీ నుంచి శ్రీరామ శోభాయాత్ర ప్రారంభమైంది. దేవదేవుడు, పితృవాక్పరిపాలకుడు, ఒకేటే. బాణం, ఒకటే మాట అంటూ కలియుగ మానవాళికి ఆదర్శ దైవంగా నిలిచిన శ్రీరాముల వారి నవమి రోజు ఆయన నామ స్మరణలతో పాతబస్తీ మారుమ్రోగింది. మంగళ్‌హాట్‌లోని సీతారాంబాగ్ నుంచి ప్రారంభమైన శోభాయాత్రలో శ్రీరామ నామాలు శతకోటి అంటూ వాటిని కీర్తిస్తూ భక్తులు ముందుకు కదులుతున్నారు. కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగే ఈ శోభాయాత్రలో భక్త జనం భారీగా పాల్గొన్నారు. శోభాయాత్రలో రామనామస్మరణలు మిన్నంటుతున్నాయి.

శోభాయాత్రకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి తోమ్మిది గంటల వరకు సాగే ఈ యాత్రలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 10 వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మొదటిసారిగా శోభాయాత్రలో రెండు పోలీస్ పెట్రోలింగ్ వాహనాలను, నూతనంగా తయారు చేసిన సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ శోభాయాత్రను పర్యవేక్షిస్తుంది. మంగళ్‌హాట్‌ నుంచి మొదలైన ఈ యాత్ర సుత్తాన్‌బజార్‌ వరకు కొనసాగనుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles