Suresh bhai patel | Eric parker | Court

Police office may offer to 10 years prison on the case of attack on indian at albama dist

suresh bhai patel, US, Police, Indian, Alabama, Eric parker, Jail, Court

A US grand jury has indicted an Alabama police officer, captured on video throwing an Indian man to the ground, on a civil rights charge stemming from the use of unreasonable force, federal prosecutors.

భారతీయుడిపై దాడి కేసులో.. పోలీస్ కు జైలు శిక్ష..!

Posted: 03/28/2015 12:24 PM IST
Police office may offer to 10 years prison on the case of attack on indian at albama dist

భారతీయుడి పై దాడి చేసి,  ఆస్పత్రిపాలు చేసిన ఘటనలో అమెరికా పోలీస్ లకు అక్కడి కోర్ట్ షాక్ ఇవ్వనుంది. భారతీయుడిపై అకారణంగా దాడికి పాల్పడిన పోలీస్ అధికారి ఎరిక్ పార్కర్ కు పదేళ్ల జైలు ఖాయమంటున్నారు న్యాయనిపుణులు. అమెరికా చట్టం ప్రకారం పౌరులకు అండగా నిలవాల్సిన పోలీసులు ఇలా అమానుషంగా ప్రవర్తించడం ఏంటని కోర్ట్ ప్రశ్నించింది. అమెరికాలోని అలబామా రాష్ట్రంలో మాడిసన్ నగర శివారులో కొత్త ఇల్లు కొనుకున్న భారత సంతతికి చెందిన ఇంజనీరు చిరాగ్ పటేల్ తన ఏడాదిన్నర కొడుకును చూసుకోవడానికి తండ్రి సురేష్‌భాయి పటేల్‌ను పిలిపించుకున్నాడు. ఇతనికి ఇంగ్లీష్ రాదు. ఇంటికి ఎదురుగా రోడ్డుప్రక్కగా వాకింగ్ చేస్తుండగా ముగ్గురు పోలీసులు ఈయనను అటకాయించారు. పోలీసులు అడిగే ప్రశ్నలు అర్థంకాక నో ఇంగ్లీష్, ఇండియన్ అనే పదాలను మాత్రమే ఉచ్ఛరించాడు.

అయితే వృద్ధుడు చెప్పే మాటలేవి పట్టించుకోకుండా పోలీసులు ఒక్కసారిగా కాళ్లపై తన్ని కిందకు పడేసి, చేతులు రెండు వెనక్కి విరిచి మీదకూర్చున్నారు. ఈ ఘటనలో వృద్ధుడి తలకు తీవ్రగాయామై రక్తాలపాలయ్యాడు. దాంతో ప్రస్తుతం పక్షవాతానికి గురైన సురేష్‌భాయి పటేల్‌ గత కొంత కాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ కేసులో పోలీస్ అధికారి వైఖరిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. భారత్ దౌత్య కార్యాలయం కూడా ఈ ఘటనపై ఆరా తీసింది. బాధితుడికి అండగా నిలుస్తామని భారత విదేశీ మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది. అయితే ఆస్పత్రిలో గత కొంత కాలంగా చికిత్స పొందుతున్న సురేష్ భాయ్ పటేల్ ఆరోగ్యం మాత్రం ఇంకా కుదుట పడలేదు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : suresh bhai patel  US  Police  Indian  Alabama  Eric parker  Jail  Court  

Other Articles