Jagan | Babu | Hightech

Ys jagan fire on chandrababu for his policy

ys jagan, chandrababu, assembly, hightech, assembly

ys jagan fire on chandrababu for his policy. ys jagan fire on ap cm chandrababu naidu at the ap assembly. he said that every will reveal to the people and this is hitech generation.

బాబూ.. హైటెక్ యుగంలో ఉన్నాం తెలుసా..?

Posted: 03/27/2015 04:24 PM IST
Ys jagan fire on chandrababu for his policy

ఇది కంప్యూటర్ యుగమని, అందరికీ అన్ని విషయాలూ తెలిసిపోతున్నాయని వైయస్ జగన్ అన్నారు. అందువల్ల ఇప్పుడు ఏమైనా చేయచ్చు, మోసం చేయచ్చు, అబద్ధాలు చెప్పచ్చు, వెన్నుపోటు పొడవచ్చు అనుకుంటే కుదరదని చంద్రబాబును ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు.  సీఎం కార్యాలయంలో ఏం చేస్తున్నారో కూడా అందరికీ తెలుస్తోందని  అన్నారు. లెక్కల్లో తేడాలు చూపిస్తూ రాష్ట్ర పరువును బజారులో పడేస్తున్నారని అసెంబ్లీలో విపక్ష నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. కాగా హైటెక్ యుగంలో ఉన్నాం చంద్రబాబు అని హైటెక్ బాబుగా పిలిచే చంద్రబాబుకే చెప్పడం ఏంటని కొందరు అప్పుడే చర్చించుకుంటున్నారట.

గతంలో రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపుల మహిళలు తక్కువ వడ్డీ ఉండటంతో సంతోషంగా ఉండేవారని, కానీ ఇప్పుడు మాత్రం 18 శాతం వడ్డీ కట్టుకోవాల్సి వస్తోందని ఆయన అన్నారు. 5.60 లక్షల ఇళ్లు సగంలో ఆగిపోయి ఉన్నాయని తెలిపారు.  వీటికి బిల్లులు ఆపేయాలని ఒక జీవో విడుదలైందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏడాదికి 60వేలు వచ్చినా వాళ్లు పేదలేనని దివంగత నేత వైఎస్ చెప్పారని తెలిపారు. కేంద్రం చాలీచాలని విధంగా 10 శాతం మందికి కూడా సరిపోని విధంగా ఇచ్చారన్నారు. అప్పటివరకు 15 లక్షల పెన్షన్లు మాత్రమే ఉంటే, వైఎస్ హయాంలో అవి 38 లక్షలకు వెళ్లాయని అన్నారు. పుష్కరాల గురించి మాట్లాడుతూ 1400 కోట్లు బడ్జెట్లో కేటాయించామని చెప్పారు. కానీ 200 కోట్లు కేటాయించినట్లు చంద్రబాబుగారు సభలో చెప్పారు. ఈ లెక్కల్లో తేడాలేంటో మాకు అర్థం కావట్లేదని వైయస్ జగన్ మండిపడ్డారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan  chandrababu  assembly  hightech  assembly  

Other Articles