Acb | Rides | Assit. drug controller

Acb rides on assit drug controller in adilabad

ACB, drug contriller, adilabad, vijay gopal

acb rides on assit. drug controller in adilabad, acb officials rides on govt officer and shock for his assets nearly 150cr.

అవినీతికి పరాకాష్ట @ 150 కోట్ల.. ఏసిబికే షాక్

Posted: 03/27/2015 01:46 PM IST
Acb rides on assit drug controller in adilabad

బతక లేక బడి పంతులుగా మారాడు అని పాత కాలంలో ఓ సామెత. ప్రభుత్వం ఉద్యోగం చేసే వాళ్లు ఏ మాత్రం సంపాదించలేరని అప్పట్లో అనుకునే వారు. కానీ ఇప్పుడు మాత్రం చిన్న గవర్నమెంట్ జాబ్ దొరికినా చాలు.. లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు కొందరు. జాబ్ రావాలే కానీ తమ చేతి వాటం ఏంటో చూపిస్తున్నారు. అక్రమ సంపాదనలో ఆలస్యం అనే పదానికి తావులేకుండా ఎడాపెడా సంపాదిస్తు, చివరికి ఏసిబికి చిక్కుతుంటారు. తాజాగా ప్రభత్వోగాన్ని వెలబెడుతున్న ఓ భారీ తిమింగళాన్ని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అయితే ముందు మామూలుగా అనుకున్నా.. తవ్విన కొద్ది అవినీతి బయటపడుతోంది. దాంతో ఏసిబి అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. సెన్సక్స్ లాగా అంతకంతకు ఆస్తుల విలువతో అవినీతికి మరో భాష్యం చెబుతున్నారు.

ఆదిలాబాద్‌ అసిస్టెంట్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ మయూరి విజయ్ గోపాల్ ఇంటిపై ఏసీబీ అధికారులు ఈ తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఆదిలాబాద్తో పాటు హైదరాబాద్లోని ఆయన ఇళ్లపై అధికారులు ఏకకాలంలో దాడి చేశారు. ఈ సందర్భంగా అధికారుల తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడ్డాయి.గోపాల్ నివాసంలో,  షాద్ నగర్, అంబర్పేట డీడీ కాలనీ, చిక్కడపల్లి, హయత్ నగర్, నల్లకుంటల్లో షాపింగ్ కాంప్లెక్స్లతో పాటు ఇళ్ల స్థలాలు, భారీ ఎత్తున బంగారం, విలువైన ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గోపాల్ అవినీతి చిట్టాను లెక్కకట్టేందుకు అధికారులకు కనీసం వారం రోజులు సమయం పడుతుందట. ఇంతకీ అయ్యగారి ఆస్తులు సుమారు 150 కోట్లు ఉంటుందని అంచనా.గతంలోనూ గోపాల్ అక్రమాస్తుల కేసులో ఓసారి ఏసీబీకి చిక్కారు. ఆ తర్వాత కూడా ఆయన తన అక్రమ సంపాదనను ఆపలేదు. అడ్డదిడ్డంగా సంపాదించిన సొమ్మును గోపాల్ బినామీల పేర ఉంచాడు. అయితే ఆస్తుల వివరాలను ఆ బినామీలకు కూడా తెలియకుండా మేనేజ్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ACB  drug contriller  adilabad  vijay gopal  

Other Articles