High court orders andhra to return lands to farmers who are not willing to give to land pooling.

High court orders ap government to return lands to farmers which were taken without conscent

Land pooling andhra, highcourt orders to return lands, andhra farmers lands, tullur capital, andhra capital land pooling

High court orders AP Government to return lands to farmers.

రైతులకు ఇష్టమైతేనే.. ల్యాండ్ పూలింగ్‌! - రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు

Posted: 03/27/2015 12:30 AM IST
High court orders ap government to return lands to farmers which were taken without conscent

రైతులకు ఇష్టమైతేనే.. ల్యాండ్ పూలింగ్‌! - రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు

నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి టీడీపీ సర్కార్ చేపట్టిన ల్యాండ్‌ పూలింగ్‌ను వ్యతిరేకిస్తూ ఏపీ రాజధాని ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని నుంచి తమను విముక్తి చేయాలంటూ ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాలకు చెందిన మొత్తం 32 మంది రైతులు కోర్టులో పిటిషన్ వేశారు. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం స్వచ్ఛందంగా రైతులు భూములు ఇస్తేనే తీసుకోవాలని, బలవంతంగా భూములు తీసుకుంటున్నారని రైతులు తమ పిటిషన్లో పేర్కొన్నారు.

భూసమీకరణ ఇష్టంలేని రైతులను జాబితా నుంచి తొలగించాలని రాష్ట్ర హైకోర్టు... సీఆర్డీఏ కమిషనర్‌ను ఆదేశించింది. ఇష్టంలేని రైతులు ఎంతమంది వున్నారు..? వారికి సంబంధించి భూములు ఎంత మేర వున్నాయి..? అన్న విషయాలతో కూడిన సమగ్ర నివేదికను 15 రోజుల్లోగా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

అంగీకార పత్రాలను వెనక్కి తీసుకుంటామన్న రైతుల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, 15 రోజుల్లోగా ఆ దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభుత్వం ఈ సందర్భంగా హైకోర్టుకు తెలిపింది

Pawan-Tullur-Statements

రైతుల కన్నీళ్లతో ఏర్పడే రాజధాని వద్దని, ఆనందంగా ఇస్తేనే భూములు తీసుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఇంతక ముందు అన్నారు. . రైతుల బాధను చూడటానికే తాను వచ్చానని, రైతు కన్నీరు పెడితే ఆ శోకం రాజధానికి తగులుతుందన్నారు.డెడ్ లైన్ పేరుతో రైతుల భూములు లాక్కోవద్దని టీడీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని తెలియజేశారు. మీ కోసం పోరాడుతానన్నారు.

తన పోరాటం అధికారం కోసం కాదు అని, ప్రజల కోసం అని తెలిపారు. రాజధాని భూముల దగ్గరి నుండి రాష్ట్ర విభజన, ఏపికి ప్రత్యేక హోదా వరకు అన్ని అంశాలను పవన్ March 6th ప్రెస్ మీట్ ప్రస్తావించారు; పవన్ ప్రెస్ మీట్ హైలెట్స్..
* ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి మాట్లాడలేదు. నాకు ఎవరితోనూ విభేదాలు లేవు
* చిన్న రైతులు తమ వద్ద నుండి పొలాలను తీసుకోవద్దని అంటున్నారు.
* అభివృద్ది రాజకీయ నాయకులకా, రైతులకా ?
* సింగపూర్ కంటే ఏపి రాజధాని భూమి ఎక్కువ.
* 90శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని మంత్రులు తెలిపారు.
* వ్యవసాయం చెయ్యకపోతే రైతుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.
* మూడు పంటలు పండే భూములను ఇచ్చందుకు రైతులు సిద్దంగా లేరు.
* ఇప్పటికే మూడు సార్లు తమ భూములను ఇచ్చామని బేతంపూడి రైతులు ఆవేదన చెందుతున్నారు.
* 32 వేల ఎకరాల భూములను సేకరిస్తే అవి, ఎప్పటికి అభివృద్ది చెందుతాయి.
* భూమిని సేకరించడం వల్ల వచ్చే నష్టాలను అంచనా వేశారా?
* రాజధాని కోసం భూములను సేకరించడం తప్పు కాదు, కానీ ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి అన్నదే ప్రశ్న.
* భూములు ఇచ్చిన తర్వాత గ్యారంటీ ఎలా ఉంటుందని ప్రశ్నలు వచ్చాయి.
* పొలాలపై ఎంతో మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డారు
* గోరేటి వెంకన్న రాసిన పల్లె కన్నీరు పెడుతుందో పాట..సెజ్ ల గురించి పాడారు
* ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజి సరిపోవడం లేదు.
* కొందరి ఏడుపులు రాజధానికి మంచివి కావు
* నేను పోరాటం చేస్తే అభివృద్ది నిరోధకుడినంటూ నన్ను జైల్లో పెడతారు
*సింగపూర్ లో కమిట్ మెంట్ లీడర్ షిప్ ఉంది కానీ మన దగ్గర తీవ్ర అవినీతి రాజకీయాలు ఉన్నాయి
*పెద్ద మనుషుల ఒప్పందాన్ని సరిగా పాటించకపోవడం వల్లే ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవాల్సి వచ్చింది
*సింగపూర్ లాంటి రాజధానిని నిర్మించాలని అనుకోవడం మంచి విషయమే. సింగపూర్ రాజధాని నిర్మాణానికి దాదాపు 25 సంవత్సరాలు పట్టింది
* సెజ్ లను మంచి కోసం ఉద్దేశించినా ఎంత మంది వాటిని సద్వినియోగం చేసుకున్నారు
* స్వచ్ఛందంగా పొలాలు ఇచ్చిన వారికి ఎలాంటి రాజ్యాంగపరమైన రక్షణ కల్పిస్తారో వివరించాలి.
* గాంధీజీ కోరుకున్న గ్రామస్వరాజ్యం కావాలి కానీ గ్రామాలను చిదిమెయ్యవద్దు
* ఇది అధికారం కోసం పోరాటం కాదు ప్రజల కోసం పోరాటం.
* ఆ మూడు గ్రామాల కోసం ప్రత్యేక కమిటి వెయ్యాలి
* సేకరించిన భూమి ఎంత వరకు రైతులకు ఉపయోగపడుతుంది?
* మురళీ మోహన్ లాంటి వ్యక్తులు భూములు కోల్పోతే పర్లేదు కానీ రైతులు భూములు కోల్పోతే తట్టుకోలేరు
* విధివిధానాలు మార్చండి అని నేను చెప్పడం లేదు.
* సెజ్ లను ఏర్పాటు చేసే సమయంలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
* ఏపిలో 40శాతం తీరప్రాంతం ఒకరి చేతిలోనే ఉంది.
* సెజ్ లపై ఎంత పోరాటం చేసినా, ప్రయోజనం లేకుండా పోయింది.
* సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోకపోతే సంక్షోభం వస్తుంది
* వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రాకపోతే మా పరిస్థితి ఏంటని రైతుల ప్రశ్న.
* పారిశ్రామికి విధానం అంటే రైతులను కూలీలుగా మార్చే విధానం ఉండకూడదు
* పెద్ద రాజధాని నిర్మాణాన్ని ఎవరూ కాదనరు.
* హైదరాబాద్ లో సేకరించిన భూమి ఇంకా ఖాళీగానే ఉంది

 

బలవంతపు భూ సమీకరణ వ్యతిరేకిస్తున్న రైతులందరి సమిష్టి విజయం అని, రైతుల తరఫున వాదించిన న్యాయవాది పి.సుధాకర్ రెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో అంగీకార పత్రాలను నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చని ఆయన తెలిపారు. మరి వరల్డ్ క్లాస్ కేపిటెల్ సిటిని నిర్మించాలని అనుకుంటూ, ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్న చంద్రబాబు సర్కార్ ఇక ముందు ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. హైకోర్ట్ తీర్పుపై సిఎం చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : chandrababu  land pooling  tullur  pawan kalyan  

Other Articles