No confidence | ap | assembly

No cofidence motion on ap sepaker will discuss on april4

no conidence motion, ysrcp, jagan, tdp, kodela, shivaprasad, ap, assembly

no cofidence motion on ap sepaker will discuss on april4. the ysrcp leaders propose to the no confidence motion on speaker kodela shiva prasad. the tdp leaders are ready to face no confidence motion in ap.

ఏప్రిల్ 4న చూసుకుందాం.. సరే చూసుకుందాం

Posted: 03/26/2015 02:21 PM IST
No cofidence motion on ap sepaker will discuss on april4

ఇదేదో సినిమా విడుదల కు డేట్ ఇచ్చినట్లు ఉన్నారనుకున్నారా.. కాదు కాదు అంతకన్నా రసవత్తరంగా సాగుతున్న ఏపి అసెంబ్లీలో జరిగే కీలక చర్చ గురించి ఈ డేట్. ఏపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చేసిన అనవసర వ్యాఖ్యలు, తిట్ల దండకాలపై మండిపడింది టిడిపి. అయితే అసెంబ్లీలో తమ వాయిస్ వినిపించేందుకు అస్సలు అవకాశం ఇవ్వడంలేదని, స్పీకర్ ఏకపక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. అయినా స్పీకర్ వైఖరి మారడం లేదంటూ ఏకంగా అవిశ్వాస తీర్మానానికి వైసీపీ పూనుకుంది.

అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభా వ్యవహరాల సలహా సంఘం భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన ఆయన చాంబర్లో ఈ సమావేశం జరిగింది. స్పీకర్పై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఎప్పుడు చర్చకు చేపట్టాలో ఈ భేటీలో నిర్ణయించారు. ఏప్రిల్ 4న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అప్పుడు స్పీకర్ శివప్రసాద్పై అవిశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చించనున్నారు. బీఏసీ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జ్యోతుల నెహ్రు, గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. మరి స్పీకర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వల్ల వైసీపి ఎంత లాభపడుతుందన్నది ప్రశ్న. కాగా స్పీకర్ పై పెట్టిన అవశ్వానికి తాము భయపడేది లేదు అని టిడిపి నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. మరి ఏప్రిల్ నాలుగున ఏ సీన్ ఏపి అసెంబ్లీలో చోటుచేసుకుంటుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : no conidence motion  ysrcp  jagan  tdp  kodela  shivaprasad  ap  assembly  

Other Articles