kalavathi | beat | renukachowdary | follower

Kalavathi beat the congress leader renuka chowdary follower

renuka chowdary, renuka, congress, kalavathi, beat, congress, khammam

kalavathi beat the congress leader renuka chowdary follower. kalavathi, who was cheated by renuka chowdary at the last general elections. she demand to return her money.

రేణుకా అనుచరుడి చెంపలు వాయించిన ఫైర్ బ్రాండ్.. లేడి

Posted: 03/25/2015 05:08 PM IST
Kalavathi beat the congress leader renuka chowdary follower

కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పిస్తానని నమ్మించి 1.10 కోటి రూపాయల మోసం చేసినట్టు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరిపై కళావతి అనే మహిళ కొన్ని రోజుల క్రితమే కేసు పెట్టింది. గత ఎన్నికలలో తన భర్త రాంజీకి ఖమ్మం జిల్లాలో వైరా అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు బాధితురాలు తెలిపింది. రేణుకా చౌదరి తన భర్తకు ఆమె టికెట్ ఇప్పించకపోవడంతో ఆయన తీవ్ర మానసికవేదన అనుభవించి చనిపోయారని గతంలోనే ఆమె తెలిపారు.

అయితే తాజాగా తమ డబ్బులు తిరిగివ్వాలంటూ రేణుకా చౌదరి అనుచరుల మీడియా సమావేశాన్ని ఆమె అడ్డుకున్నారు.మీడియా సమావేశాన్ని అడ్డుకోవడమే కాకుండా రేణుక అనుచరుడు సైదులు నాయక్ పై ఏకంగా చెప్పుతో దాడి చేశారు. రేణుకా చౌదరి, ఆమె అనుచరులు కలిసి తమను మోసం చేయడమే కాకుండా, కులం పేరుతో దూషించారని కళావతి ఆరోపించారు. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుంటే తన పిల్లలతో కలిసి రేణుకాచౌదరి ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించింది. అవసరమైతే సోనియా గాంధీని కలిసి తనకు జరిగిన అన్యాయం వివరిస్తానని తెలిపింది. కళావతి ఫిర్యాదు మేరకు రేణుకాచౌదరితోపాటు మరో ఆరుగురిపై ఈనెల 16న ఖమ్మం అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అ ట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. తమను మోసం చేసిన కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిపై చర్యలు తీసుకోవాలని గిరిజన మహిళ, డాక్టర్ రాంజీ నాయక్ భార్య కళావతి డిమాండ్ చేశారు. మొత్తానికి కాంగ్రెస్ లో ఎంతో కీలకనేతగా ఉన్న రేణుకాచౌదరిపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి రేణుకాచౌదరి వ్యవహారం ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : renuka chowdary  renuka  congress  kalavathi  beat  congress  khammam  

Other Articles