letters | kcr | mlc | elections

Letters on telangana cm kcr from the graduates in mc elections ballot boxes

mlc, graduates, kcr, telangana, letters, ballot, votes, counting, pooling,

letters on telangana cm kcr from the graduates in mc elections ballot boxes. in the mlc elections graduates wrote some letter to cm kcr. some graduates warned to kcr for his govt policy.

బ్యాలెట్ బాక్సుల్లో లేఖలు.. కెసిఆర్ కు హెచ్చరికలు

Posted: 03/25/2015 04:07 PM IST
Letters on telangana cm kcr from the graduates in mc elections ballot boxes

తెలంగాణలో ఎన్నికల్లో అజేయంగా గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కెసిఆర్ కు అప్పుడే వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లున్నాయి. అయితే ఎప్పుడూ ఉద్యోగుల పాట పాడే కెసిఆర్ కు ఉద్యోగుల నుండే ముప్పు పొంచి ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గత ఆదివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ప్రభావం ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే కెసిఆర్ కు నిన్నటి దాకా ఉద్యోగులే బలం అనుకున్న వారు కూడా ఏం జరుగుతుందో అని అనుమనం కలుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్, బిజెపిల మధ్యే ప్రధానంగా పోటీ ఉంది అని అందరికీ తెలిసిన విషయమే. అయితే కెసిఆర్ ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న వైఖరిపై అనుకోని రీతిలో ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ను హెచ్చస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్‌ బాక్సుల్లో బయటపడ్డ లేఖలు తాజాగా కలకలం రేపుతున్నాయి. ఖబడ్దార్‌ కేసీఆర్‌....తీరు మార్చుకోకపోతే గుణపాఠం చెపుతామంటూ లేఖల్లో పట్టభద్రులు హెచ్చరించారు.  నిరుద్యోగులను నిలువునా ముంచేశారని, కాంట్రాక్టు ఉద్యోగులను ఎప్పుడు క్రమబద్దీకరిస్తారు అంటూ బ్యాలెట్‌ బాక్సుల్లో ఓటర్లు లేఖలు వేశారు. హైదరాబాద్‌కు చెందిన బ్యాలెట్‌ బాక్సుల్లో నుంచి ఈ లేఖలు బయటపడ్డాయి. అటు నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ నియోజకవర్గాల బ్యాలెట్‌ బాక్సుల్లోనూ లేఖలు బయటపడ్డాయి. డీఎస్సీపై ప్రకటన చేయాలని, ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరించాలంటూ వినతి పత్రాలు దర్శనమిచ్చాయి. మొత్తానికి తెలంగాణ సిఎం కెసిఆర్ పై ఉన్న వ్యతిరేకతలను ఇలా ఏకంగా బ్యాలెట్ బాక్సుల్లో వ్యక్తం చెయ్యడం విశేషం. ఎన్నికల అధికారులు లెక్కింపు సమయంలో వీటిని చూసి ఖంగుతిన్నారు. మరి కెసిఆర్ వీటిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mlc  graduates  kcr  telangana  letters  ballot  votes  counting  pooling  

Other Articles