Singapur nation father lee kun yu lost his lost breath today

lee kun yu, singapur, first pm, malasiya, modi, obama

singapur nation father lee kun yu lost his lost breath today. when singapur devided from malasiya lee kun yu look dare actions to growth of singapur. singapur now got world class nation on ultimate service of lee kun yu.

అస్తమించిన సింగపూర్ పితామహుడు.. పలువురి సంతాపం

Posted: 03/23/2015 12:35 PM IST
Singapur nation father lee kun yu lost his lost breath today

మలేసియా నుండి సింగపూర్ విడిపోయి. ప్రత్యేక దేశంగా ఏర్పడినపుడు ఎంతో నేర్పుగా నిర్ణయాలు తీసుకొని అభివృద్ది వైపు సింగపూర్ ను పరుగులు పెట్టించారు  సింగపూర్ తొలిప్రధాని లీ కువాన్ యూ. గత కొద్ది కాలంగా న్యూమోనియా కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లీ కువాన్ యూ ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. 1923 సెప్టెంబర్ 16న జన్మించిన ఆయన ఆసియా రాజకీయాల్లో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారు. ఆయనను ఆధునిక సింగపూర్ పితామహుడిగా అక్కడి ప్రజలు పిలుచుకుంటారు. ఆగ్నేయాసియాలోని పలు దేశాలతో ఆయన ఎన్నో మైత్రి సంబంధాలు నెలకొల్పి అన్ని రంగాల్లో సింగపూర్ దూసుకెళ్లేలా కృషిచేశారు.

modi-tweet

సామ్యవాద సిద్ధాంతాన్ని నమ్ముకుని రాజకీయాల్లో ముందుకు వెళ్లి సింగపూర్ తొలి ప్రధాని అయ్యారు. ఈ సందర్భంగా పలు దేశాల ముఖ్య నేతలు ఆయనకు సంతాపం ప్రకటిస్తూ.. ప్రపంచ రాజకీయాలకు గొప్ప దిక్సూచిలాంటివారని కొనియాడారు. నివాళులర్పించినవారిలో భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా ఉన్నారు. లీ కువాన్ యూ సింహంలాంటి వారని మోదీ కొనియాడారు. సింగపూర్ తొలిప్రధాని లీ కువాన్ యూ నాయకుల్లో సింహంలాంటి వారని భారత ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ప్రతి ఒక్క నాయకుడు ఆయనను అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lee kun yu  singapur  first pm  malasiya  modi  obama  

Other Articles