కనీసం రాజధాని కూడా లేకుండా ఏర్పటైన తొలి రాష్ట్రం ఏపి రాజధానికి దాదాపుగా పేరును ఖరారు చేసింది. అయితే తొలుత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరును పెట్టాలని బావించారు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకుందని అపవాదు వస్తుందని ఆలోచించిన ఏపి సిఎం చంద్రబాబు నాయుడు అందరికి ఆమోద్యయోగ్యంగా ఉండేలా కొత్త రాజధాని పేరు ఉండాలని అనుకున్నారు. ప్రపంచ స్థాయి నగరంగా, అత్యాధునిక హంగులతొ కూడిన తొలి రాజధానిగా చరిత్రకెక్కనున్న ఏపి కొత్త రాజధాని పేరును అందరికి సమ్మతించేలా ఉంచాలని ఏపి ప్రభుత్వం యోచిస్తోంది.
దాదాపు 35వేల ఎకరాల్లో నిర్మిస్తోన్న ఏపీ రాజధాని నగరాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. భారీతనంతో నిర్మిస్తున్న రాజధానికి ఘనమైన పేరును పెట్టాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. సంప్రదాయం ఉట్టిపడేలా పేరు ఉండాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతి పేరును పలువురు ప్రతిపాదిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మదిలోకూడా అమరావతి పేరు మీద మక్కువ చూపిస్తున్నారన్న వాదన ఉంది. ఆ విషయానికి బలం చేకూరేలా ఒక ఘటన చోటు చేసుకుంది. ఏపీ కొత్త రాజధానికి అమరావతి పేరును పరిశీలిస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం.. రాజధాని అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్న సింగపూర్ బృందంతో మాట్లాడిన సందర్భంలో అమరావతి పేరును ప్రస్తావించి.. ఆ పేరు ఎలా ఉంటుందని అడిగినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ ఉన్న పరిస్థితుల్లో ఏపీ రాజధాని నగరానికి అమరావతి పేరునే పలువురు ప్రతిపాదిస్తున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ఖరారు కాలేదు కానీ దాదాపు అమరావతి పేరు ఓకే అవుతుందని అధికారులు కూడా అనుకుంటున్నారట.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more