Annapurna studios seized by the bank officials

annapurna studio, nagarjuna, akkineni annapurna, akkineni family, akkineni nagarjuna, king nagarjuna

annapurna studios seized by the bank officials. the annapurna studios managment took loan from several banks around 62 crore. the andhra bank gave 32.3 cr, indian bank gave 29.7 cr on annapurna studio. the both bank officials sent notices to annapurna managment, but managmant didnot reply to the notices. on that banks seized the annapurnastudios.

అన్నపూర్ణ స్టూడియో సీజ్.. బ్యాంకులకు భారీగా బకాయిలే కారణం

Posted: 03/23/2015 10:19 AM IST
Annapurna studios seized by the bank officials

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు హీరో నాగార్జున. హీరోగానే కాకుండా అనేక బిజినెస్ లను నడుపుతూ సంపాదనలో ఎంతో ముందున్నారు. మా టివి, అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి వాటిని ఎంతో సక్సస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. అయితే తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ పై బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో స్టూడియోపై తీసుకున్న లోన్ లను, వాటి వడ్డీలను సకాలంలో కట్టకుండా పేచి పెడుతున్నారని, వడ్డీతో సహా లోన్ లను కూడా క్లీయర్ చెయ్యాలని బ్యాంకులు నోటీసులు పంపించాయి. అయినా అన్నపూర్ణ స్టూడియోస్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో బ్యాంకు అధికారులు స్టూడియోను సీజ్ చేశారు. ఎంతో సంవత్సరాల చరిత్ర కలిగిన అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పుడు ఇలా సీజ్ కావడంపై తెలుగు ఇండస్ట్రీలోనూ కాస్త అసహన్యం వ్యక్తమవుతోంది.

అన్నపూర్ణ స్టూడియోస్ పై 62 కోట్ల రూపాయల లోన్ తీసుకున్నారు యాజమాన్యం. ఆంధ్రాబ్యాంక్ లో 32.3 కోట్లు, ఇండియన్ బ్యాంక్ ద్వారా 29.7 కోట్ల రూపాయల లోన్ తీసుకున్నారు. అయితే దీనిపై అక్కినేని నాగార్జున, అక్కినేని వెంకట్, సుప్రియ, సురేంద్ర, నాగ సుశీలకు బ్యాంక్ నోటీసులు పంపింది. అయినా వారు లోన్ ను తిరిగి చెల్లించడంలో ఎలాంటి చొరవచూపలేదు. దాంతో ఆంధ్రాబ్యాంక్, ఇండియన్ బ్యాంక్ అధికారులు ఉమ్మడిగా నోటీసులు పంపి, చివరకు అన్నపూర్ణ స్టూడియోస్ ను సీజ్ చేశారు. దాదాపు 7 ఎకరాల 25 గుంటల విశాలమైన అన్నపూర్ణ స్టూడియోస్ పూర్తిగా బ్యాంక్ అధికారులు సీజ్ చేశారు. బ్యాంక్ లోన్ ను క్లియర్ చేయాలని నోటీసులు పంపినా, కనీసం రిప్లై రాలేదని, అందుకే స్టూడియోను సీజ్ చేశామని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. మరి అక్కినేని కుటుంబం అన్నపూర్ణ స్టూడియోస్ విషయంలో ఎలా ముందుకు వెళుతుందొ చూడాలి.

nagarjuna-ad-news

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles