Tttdp leaders reventhreddy and errebelli meet congress senior leader janareddy

janareddy, congress, assembly, ttdp, telanagana, speaker

tttdp leaders reventhreddy and errebelli meet congress senior leader janareddy. in telagana assembly ttdp leaders suspended from the house for this sessions. the ttdp leaders request to janareddy to quit the suspention.

జానా.. నీవే దిక్కంటున్న టిటిడిపి ఎమ్మెల్యేలు

Posted: 03/19/2015 10:40 AM IST
Tttdp leaders reventhreddy and errebelli meet congress senior leader janareddy

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి రాజకీయాల్లో ఆరితేరారు. అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన వివాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పై వేటుకు తెలంగాణ అసెంబ్లీ ప్రయత్నించింది. అయితే అతను సభకు కొత్త అని కాబట్టి అతనికి తెలియదని జానారెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చారు. దాంతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే తెలంగాణ సిఎం కెసిఆర్ కూడా జానారెడ్డి అంటే ఎంతో గౌరవం ఉందని, జానా సూచనలను ఖచ్చితంగా పాటిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు టిటిడిపి ఎమ్మెల్యేలు జానారెడ్డిని ఆశ్రయిస్తున్నారు. మీరే మా దిక్కు అంటు తెలంగాణ తెలుగుదేశం పార్టికి చెందిన సస్పెండెడ్ ఎమ్మెల్యేలు అంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీలో జాతీయగీతాన్ని అవమానించేలా నడుచుకున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. దాంతో ఏం చెయ్యాలో తెలియని టిటిడిపి  నేతలు తమను ఎలాగైనా సభలోకి అనుమతించాలని కోరుతున్నారు. అందుకు అన్ని ప్రయత్నాలను చేసినా ఫలితం లేకుండా పోయింది. అందుకే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ని ఆశ్రయించారు. ఎలాగైనా తమపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేసేలా చూడాలని ఆయన్ను కోరారు. అయితే దానిపై స్పందించిన జానారెడ్డి.. ప్రభుత్వంతో గతంలోనే చర్చించానని, మరోసారి చర్చిస్తానని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఉన్న సస్పెన్షన్ ను తగ్గించేలా చూడాలని కూడా వారు కోరుతున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : janareddy  congress  assembly  ttdp  telanagana  speaker  

Other Articles